
కాంగ్రెస్‌తో పొత్తుకు ఎందుకంత బెట్టు
కొండా దంపతులనే చేర్చుకున్నారు కదా? : నారాయణ
హైదరాబాద్, మార్చి 21 (జనంసాక్షి) :
పొత్తులపై టీిఆర్‌ఎస్‌కు పట్టు విడుపులుండాలని సీపీఐ కార్యదర్శి నారాయణ అన్నా రు. పొత్తుల వ్యవహారంలో తమ పార్టీ పోటీ చేయాలను కున్న సీట్ల జాబితా తీసుకున్న తర్వాత టిఆర్‌ఎస్ నుంచి ఎటువంటి స్పందన లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. 22 అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేయాలనుకుంటున్నామని, అదే జాబితా పొన్నాలకు కూడా ఇచ్చామని చెప్పారు. కొండా సురేఖ లాంటి వారికే చేరేందుకు అవకాశం ఇచ్చిన తెరాస, కాంగ్రెస్‌తో కలవడానికి ఇబ్బంది ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. తమతో చర్చిస్తున్నామని విూడియాతో చెబుతున్న టిఆర్‌ఎస్ నేతలు, తమతో మాత్రం ఎటువంటి సంప్రదింపులు చేయడం లేదని నారాయణ ఆరోపించారు. సీపీఐతో పొత్తు వ్యవహారాన్ని ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని పొన్నాల చెప్పినట్లు నారాయణ తెలిపారు. తమతో చర్చిస్తున్నామని మీడియాతో చెబుతున్న తెరాస నేతలు, తమతో మాత్రం ఎటువంటి సంప్రదింపులు చేయడం లేదని నారాయణ ఆరోపించారు. సీపీఐతో పొత్తు వ్యవహారాన్ని రేపు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని పొన్నాల చెప్పినట్లు నారాయణ తెలిపారు.
తెరాసకు పట్టువిడుపులుండాలి




