మీరే ‘గొళ్లెం’ వేశారు
ఏప్రిల్ మొదటివారంలో జాబితా : దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ, మార్చి 23 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో జరిగిన పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనం తరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే టీఆర్‌ఎస్ గొళ్లెం వేసి అందుకు అవకాశం లేకుండా చేసిందని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఏప్రిల్ 3 లేదా 4న జాబితా విడుదల చేస్తామని అన్నారు. ఈనెల 26న కాంగ్రెస్ కేంద్ర ఎన్ని కల కమిటీ భేటీ అవుతుందని ఆయన అన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నిక లకు అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించామని అన్నారు. తెరాస తనకు తానుగానే పొత్తులు ఉండవని ప్రకటించిందని, కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము ఇప్పటికీ ఆ పార్టీతో స్నేహాన్ని కోరుతున్నామని ఆయన అన్నారు.
తలుపులు తెరిచే ఉన్నాయి





