Tuesday, 3 November 2026

మోడీపై పోటీకి సిద్ధం


కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌
భోపాల్‌, మార్చి 24 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఢీ కొట్టడానికి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ సై అన్నా రు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి తాను సిద్ధమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే వారణాసి నుంచి మోడీపై పోటీ చేస్తానని వెల్లడించారు. ఇప్పటికే అక్కడి నుంచి మోడీ పోటీ చేయడానికి రం గం సిద్దమయ్యింది. బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీకి గట్టి పోటీనిచ్చే అభ్యర్థికోసం కాంగ్రెస్‌ వెతుకుతున్న తరుణంలో దిగ్విజయ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరిం చుకున్నాయి. ఆప్‌ తరఫున అరవింద్‌ కేజ్రీవాల్‌ వార ణాసి నుంచి పోటీకి దిగుతుండటం తెలిసిందే. తాజాగా దిగ్విజయ్‌ వారణాసి నుంచి పోటీకి ఆసక్తి చూపడంతో ముగ్గురి మధ్య పోటీ ఆసక్తిగా మారనుంది. ఇదిలా వుంటే ఆనంద్‌ శర్మ కూడా
పోటీకి సిద్దపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోకసభ స్థానంలో పోటీ చేయాలని ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తన మనసులో మాటను విూడియా సమావేశంలో బయటపెట్టారు.తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వారణాసి నుంచి పోటి చేయాలని ఉంది. పార్టీ టికెట్‌ కేటాయిస్తే అందుకు సిద్దం అని అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసి బరిలో నిలవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున అరవింద్‌ కేజీవ్రాల్‌ సిద్ధమవుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ కూడా పోటీకి ఆసక్తి చూపుతుండటంతో వారణాసి పోటి మరింత ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *