Tuesday, 3 November 2026

స్వతంత్ర అభ్యర్థిగా జశ్వంత్‌ నామినేషన్‌


జైపూర్‌, మార్చి 24 (జనంసాక్షి) :
భారతీయ జనతా పార్టీ సీని యర్‌ నేత జశ్వంత్‌ సింగ్‌ సోమవారం స్వతంత్ర అ భ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రాజస్థాన్‌లోని బా ర్మెర్‌ నియోజకవర్గాన్ని తన కు కేటాయించనందుకు ఆ గ్రహించిన జశ్వంత్‌ అదే ని యోజకవర్గం నుంచి స్వ తంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. బిజెపి అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్న కల్నల్‌ సోనారామ్‌ మంగళవారం రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో కలిసి వచ్చి నామినేషన్‌ వేయనున్నట్లు సమాచారం. బార్మెర్‌ ప్రాంతంలో జాట్‌లు ఎక్కువగా ఉన్నందున జాట్‌ నాయకుడైన కల్నల్‌ సోనారామ్‌కు ఈ టికెట్‌ కేటాయించాలని వసుంధర రాజే భాజపా అగ్రనాయకత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో పార్టీ జశ్వంత్‌ను కాదని కొత్తగా పార్టీలో చేరిన సోనారామ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌ని డార్జిలింగ్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న జశ్వంత్‌సింగ్‌ ఈ ఎన్నికల్లో బార్మెర్‌ కావాలని కోరారు. బార్మెర్‌ తాను పుట్టిన వూరని, చివరి ఎన్నికలు అక్కడినుంచి పోటీచేయాలనుకుంటున్నానని తెలిపారు. కానీ అధిష్ఠానం ఆయనకు సీటు కేటాయించక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా తలపడుతున్నారు. దీంతో బిజెపిలో అంతర్గత వ్యవహారాలు బయటపడ్డాయి. ఇవి బిజెపి పుట్టి ముంచుతాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదిలావుంటే బీజేపీ, జస్వంత్‌ సింగ్‌ వివాదంలో జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఓమర్‌ అబ్దుల్లా తలదూర్చారు. సీనియర్‌ నేత జస్వంత్‌ సింగ్‌ కు టికెట్‌ నిరాకరించడంపై ఓమర్‌ అబ్దుల్లా తీవ్ర ధ్వజమెత్తారు. జస్వంత్‌ తోపాటు మరికొంత మంది జంటిల్మన్‌ నేతలకు టికెట్లు నిరాకరించి పార్టీలో గుండాలకు పెద్ద పీట వేస్తున్నారని ఓమర్‌ ఆరోపించారు. రాజీకీయాల్లో సంభవిస్తున్న ఇలాంటి సంఘటనల పట్ల భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని లేకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జంటిల్మన్‌ లాంటి జస్వంత్‌ కు టికెట్‌ నిరాకరించి గుండాలాంటి ప్రమోద్‌ ముతాలిక్‌కు రెడ్‌ కార్పెట్‌ వేశారు. బీజేపీ నిర్ణయాలు ప్రమాదకరంగా ఉన్నాయి అని ఓమర్‌ ట్విటర్‌ లో పోస్ట్‌ చేశారు. పార్టీలోకి చేరిన వెంటనే శ్రీరామ్‌ సేన చీఫ్‌ ముతాలిక్‌ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. జస్వంత్‌ సింగ్‌ కు బీజేపీ టికెట్‌ నిరాకరించడంపై సొంత పార్టీ నుంచే అనేక విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. బర్మార్‌ లోకసభ నియోజకవర్గం నుంచి జస్వంత్‌ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *