Tuesday, 3 November 2026

సీపీఐకి డబుల్‌ ధమాకా


పొత్తులకు తలుపులు తెరిచిన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌
తెరాస తీరుపై నారాయణ అసహనం
హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) :
ఎన్నికల పొత్తుల విషయంలో సీపీఐకి దబుల్‌ ధమాకా దక్కనుంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబమని తేల్చిచెప్పిన టీఆర్‌ఎస్‌ సీపీఐతో మాత్రం పొత్తుకు సై అంది. మరోవైపు కాంగ్రెస్‌ కూడా సీపీఐతో పొత్తును ఆశిస్తోంది. నల్గొండ, ఖమ్మం పార్లమెంట్‌ సీట్లలో ఒక్క సీటుతో పాటు డజన్‌కుపైగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సంసిద్ధతత వ్యక్తం చేసింది. పొత్తులపై సీపీఐతో చర్చించామని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో సోమవారం ఉదయం కె.కేశవరావు భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో కేశవరా వు మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల పొత్తుపై ఇరువురి మధ్య సానుకూలంగానే చర్చలు కొనసాగాయని అన్నారు. సీపీఐ అడిగిన స్థానాల గురించి పార్టీలో చర్చించి తుది నిర్ణయం ప్రక టిస్తామని నారాయణకు తెలియజేసినట్టు చెప్పారు. తాను కాం గ్రెస్‌లో చేరుతానన్నది నీచమైన మాట అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో కలిసి కొనసాగుదామన్న సీపీఐ ప్రతిపాదనకు ఏకీభవిం చ డం లేదని అన్నారు. సీపీఐ పోటీ చేయాలనుకుంటున్న స్థానా లపై పార్టీలో చర్చించి తమ నిర్ణయం ప్రకటిస్తామని కేకే తెలిపారు. తాను కాంగ్రెస్‌లో చేరుతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్‌తో ఇంకా స్ప ష్టత రాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ తాము ఒక లిస్టు ఇచ్చామని,
దానిపై స్పష్టత ఇవ్వకుండా చర్చలకు మళ్లీ వచ్చారని అన్నారు. కాలయాపన చేసేందుకు టీఆర్‌ఎస్‌ యత్నిస్తోందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను తన నివాసానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొత్తులపై గంటపాటు చర్చించారు. ఇదిలావుంటే కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఒక ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. సీపీఐ డిమాండ్‌కు కాంగ్రెస్‌ సానుకూలంగా స్పందించడంతో పొత్తు వ్యవహారం కొలిక్కివచ్చినట్లుగా తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ నుంచి రాగానే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో భేటీ కానున్నట్లు సమాచారం.రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లకై నేతలు పొత్తుల ఎత్తులకు సిద్ధమవుతున్నారు. సిపిఐ 20 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను అడుగుతుండగా.. వాటిలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ స్థానాన్ని సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారు అయిన వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో టీఆర్‌ఎస్‌ నేతలు కేశవరావు, వినోద్‌ కుమార్‌ సోమవారం భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పొత్తుల విషయంలో టీఆర్‌ఎస్‌ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న నారాయణను టీఆర్‌ఎస్‌ నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట సీపీఐ మూడు ఎంపీ స్థానాలుఖమ్మం, భువనగిరి, నల్లగొండ, 20 అసెంబ్లీ స్థానాలను అడిగింది. పొత్తులపై చర్చలు సాగుతున్న దశలో కనీసం 14 అయినా ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే తమకున్న ఇబ్బందుల దృష్ట్యా 12కు మించి ఇవ్వలేమని కాంగ్రెస్‌ తేల్చి చెప్పడంతో సీపీఐ వాటికే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరుపార్టీలతో పొత్తలుకు సిద్దమని సిపిఐ నేత నారాయణ ఇప్పటికే ప్రకటించారు.దీంతో ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం పూర్తి కానుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై టీ-ఆర్‌ఎస్‌ నుంచి ఇంకా స్పష్టత రాలేదని సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. పొత్తులపై టీఆర్‌ఎస్‌ నేతలు కాలయాపన కోసమే యత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ ఆలోచనను, పోటీచేసే సీట్లను టిఆర్‌ఎస్‌ నేతలకు సమర్పించామని అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలతో చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నేతలకు తమతో ఫోన్లో మాట్లాడటానికి కూడా తీరిక లేదా అని సూటిగా ప్రశ్నించారు. పొత్తుల విషయంలో తాము 15 రోజుల క్రితమే టీఆర్‌ఎస్‌కు అభ్యర్థుల జాబితా ఇచ్చామని నారాయణ తెలిపారు. ఇన్ని రోజులయినా ఎందుకు ఓ నిర్ణయం తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. చర్చలతో ఇంకా కాలయాపన చేయకుండా ఓ అడుగు ముందుకు వేసి పోటీ చేయాల్సిన స్థానాలు గుర్తించాల్సి ఉందన్నారు. అయితే ఇందుకు భిన్నంగా జరుగుతన్న పరిణామాలపై ఆయన పమండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా చర్చలు మొదలు పెట్టేదేమిటని ఆయన అన్నారు. కాగా కాంగ్రెస్తో పొత్తుపై నారాయణ స్పందిస్తూ తనకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నుంచి ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని ఒకవేళ ఫోన్‌ వస్తే అప్పుడు స్పందిస్తానని అన్నారు. ఇదిలావుంటే సీపీఐతో సీట్ల వ్యవహారంపై చర్చించామని, సానుకూల వాతావరణంలోనే ఇరుపార్టీల మధ్య చర్చలు జరిగాయని తెరాస సెక్రెటరీ జనరల్‌ కె. కేశవరావు పేర్కొన్నారు. సీపీఐ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై పార్టీలో చర్చించి నిర్ణయం తెలియజేస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో తెరాస నేతల భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. తాను కాంగ్రెస్‌లో చేరడంపై వస్తున్న వార్తలు అవాస్తవమని కేశవరావు స్పష్టంచేశారు. తెరాస వైపు నుంచి తమకు ఇంకా స్పష్టత రాలేదని సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌ పాషాలు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *