
మొన్న పవన్, నేడు నాగార్జున
అహ్మదాబాద్/హైదరాబాద్, మార్చి 24 (జనంసాక్షి) :
అక్రమాస్తులు రక్షించుకునేందుకు తెలు గు సినీవర్గాలు బీజేపీ ప్రధాని అభ్యర్థి చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. మోడీ ప్ర ధాని అయ్యే అవకాశాలున్నాయంటూ
మీడియా
ఊదరగొడుతుండటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం తమ ఆస్తులపై కన్నేయకుండా ఉండటానికి ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్కరుగా పోటీ నరేంద్రమోడీని కలిసి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. మొన్న పవన్ కల్యాణ్ మోడీ గడప తొక్కగా సోమవారం కింగ్ నాగార్జున మోడీతో భేటీ అయ్యారు. రేపో మాపో మురళీమోహన్ తదితరులు మోడీని కలువనున్నారు. మోడీతో భేటీ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడారు. మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని చూశానన్నారు. మోడీ ప్రధాని అయితే దేశానికి, ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ రెండూ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి మోడీ కృషిచేస్తారని నాగార్జున ఆకాంక్షించారు. మోడీని కలిసేందుకు నాగార్జున ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో మోడీతో భేటీ అయ్యారు. అహ్మదాబాద్‌లోని పున్సారీ గ్రామాన్ని నాగార్జున సందర్శించారు. ఈ సందర్భంగా గుజరాత్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను నాగార్జున అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్‌లో గల మమతా మందిర్‌ను సందర్శించారు. అయితే నాగార్జున రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కేవలం బిజెపికి ప్రచారం చేసేఅవకౄవాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే బిజెపికే సాధ్యమని ఆయన ప్రజలకు చెప్పే అవకాశముందని అంటున్నారు. నాగార్జున రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ఆయన సతీమణి అమల మాత్రం విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడుని సంప్రదించిన అనంతరం నాగార్జున మోడీ భేటీ అయ్యారు. కాగా నాగార్జున, మోడీలు గంటసేపు భేటీ అయ్యారు. ఇదిలావుంటే హాస్యనటుడు బ్రహ్మానందం రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని సమాచారం. అది కూడా బిజెపి ద్వారానే ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బ్రహ్మానందం కూడా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టే కన్నా ముందు నుంచే ఆయన రాజకీయాల్లో రావాలన్న అంశంపై పవన్‌తో పలు మార్లు చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఒకవైపు పవన్ మోడీకి తన పూర్తి మద్దతును ఇవ్వడం.. మరోవైపు నటుడు, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కూడా మోడీకి తన మద్దతును తెలపడానికి అహ్మదాబాద్ వెళ్లిన నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమయినట్లు కనిపిస్తోంది. దీంతో టాలీవుడ్ అంతా బిజెపి జపంలో పడిందనుకోవాలి.
మెడీని కలిసేందుకు క్యూ కట్టిన టాలివుడ్




