
శ్రీనివాసన్‌కు సుప్రీం అల్టిమేటం
న్యూఢిల్లీ, మార్చి 25 (జనంసాక్షి) :బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుం టావా? తమనే తప్పించమంటావా? అంటూ సుప్రీం కోర్టు శ్రీనివాసన్‌ను ప్రశ్నిం చింది. ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్‌కు మరోసారి చుక్కెదురైంది. విచారణ పారదర్శకంగా జరిగేందుకు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి అతను తప్పుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ కేసును విచారిస్తోన్న ధర్మాసనం మంగళవారం కీలకవ్యాఖ్యలు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటోన్న గురునాథ్ స్వయానా శ్రీనివాసన్‌కు అల్లుడే కావడంతో విచారణ సజా వుగా సాగేందుకు ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోవాలని సూచించింది. దీనిపై నిర్ణ యం తీసుకునేందుకు రెండురోజుల సమయం ఇచ్చినట్టు పేర్కొంది. ఒకవేళ శ్రీనివా సన్ తప్పుకోకుంటే తామే జోక్యం చేసుకుని వేటు వేయాల్సి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇలాంటి కేసు విచారణ
జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారికి సంబంధించిన వ్యక్తులు అధ్యక్ష పదవిలో ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీనివాసన్ ప్రెసిడెంట్‌గా తప్పుకోకుంటే విచారణ సరిగా జరగడం కష్టమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముగ్ధుల్ కమిటీ సమర్పించిన నివేదికపై ధర్మాసనం విచారణ ప్రారంభించన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. శ్రీనివాసన్ నిర్ణయం ప్రకటించేందుకు గడువు ఇచ్చిన సుప్రీంకోర్ట్ గురువారానికి విచారణను వాయిదా వేసింది. దీంతో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎప్పటి నుండో రాజీనామా చేయాలని డిమాండ్ వస్తున్నా శ్రీనివాసన్ పట్టించుకోలేదు. బోర్డులో చాలా మంది సభ్యులను గుప్పెట్లో పెట్టుకున్న శ్రీనివాసన్ ప్రెసిడెంట్‌గా మరో ఏడాది పదవీకాలాన్ని పొడిగించుకున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ తాజా తీర్పు అతనికి ఇబ్బంది కలిగించేదే. దీనిపై వ్యాఖ్యానించేందుకు శ్రీనివాసన్ నిరాకరించారు. కోర్ట్ వ్యాఖ్యలను తాను పూర్తిగా చదవలేదంటూ సమాధానం దాటవేశారు. ఒకవేళ పదవి నుంచి తప్పుకోకుంటే తామే ఆదేశాలు జారీ చేస్తానని ధర్మాసనం హెచ్చరించిన నేపథ్యంలో శ్రీనివాసన్ తాత్కాలికంగా వైదొలగడమే మంచిదని బోర్డ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి సంబంధించి బుధవారం బీసిసిఐ వర్కింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
తప్పుకుంటావా? తప్పించమంటావా?




