Monday, 2 November 2026

ప్రశాంత ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు


352 కంపెనీల కేంద్ర బలగాలు
ప్రతి పోలింగ్‌ కేంద్రంలో
కనీస వసతులు : భన్వర్‌లాల్‌
వరంగల్‌, మార్చి 25 (జనంసాక్షి) :సార్వత్రిక ఎన్నికలు ప్ర శాంతంగా నిర్వహించేందుకు పటిష్టఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించనున్నట్లు వరం గల్‌ కలెక్టరేట్‌లో ఈవీఎంలు భద్రపరిచే కార్యాలయాన్ని భన్వ ర్‌లాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రానికి 352 కంపెనీల బలగాలు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో రూ.56 కోట్లు పట్టుబడినట్లు భన్వర్‌లాల్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని భన్వర్‌లాల్‌ తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 352 కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చాయని భన్వర్‌లాల్‌ తెలిపారు. ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని భన్వర్‌లాల్‌ పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులు కల్పిస్తామని, ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించడానికి పార్టీలు సహకారమందించాలని కోరారు. ఓటరు నమోదు పక్రియ ద్వారా 76 లక్షల మందిని కొత్తగా నమోదు చేయించామన్నారు. ఓటరు నమోదు శాతాన్ని పెంచేందుకు ముఖ్య భూమిక పోషించాలన్నారు. బూత్‌ స్థాయి అధికారులు పార్టీ కార్యకర్తల ద్వారా ఓటరు నమోదు చేయించాలని సూచించారు. ఓటరు జాబితాలో ఓటరు పేరు లేదనే పరిస్థితి రాకుండా సహకరించాలన్నారు. ఎన్నికలకు వారం ముందు వరకు అంటే ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తర్వాత బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి పోల్‌ చిట్టీలను పంపిణీచేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి ఫిర్యాదులూ రాకుండా ఉండేందుకు పార్టీల వారు పాల్గొనాలన్నారు. పోల్‌ చిట్టీల పంపిణీ కార్యక్రకమం ఏప్రిల్‌ 19నుంచి 23వరకు జరగుతుందని తెలిపారు. సాధారణ ఎన్నికలకు కొత్త ఈవీఎంలు సిద్ధమయ్యాయని, వాటిపై ఎలాంటి అపోహలూ వద్దని పేర్కొన్నారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఈసారి 382 కంపెనీల కేంద్ర బలగాలను రప్పిస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *