Monday, 2 November 2026

పోలీస్‌ శాఖలో విభజన చకచకా


సమీక్షించిన హోం శాఖ ముఖ్య కార్యదర్శి టీపీ దాస్‌
హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు పోలీసు పంపకాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టింది. ఐపీఎస్‌ అధికారుల కేడర్‌ ఐదేళ్ల పాటు ఉమ్మడిగా కొనసాగనున్న నేపథ్యంలో వారి పంపకాలపైనా ఆప్షన్లిచ్చి ఆ తర్వాత పంపకాలు చేపట్టనున్నారు. ఆ తర్వాతి కేడర్‌లో గల ఏపీ పోలీస్‌ కేడర్‌ అధికారులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ఆధారంగా పంపిణీ చేయనున్నారు. మంగళవారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి టీపీ దాస్‌ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది పంపకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ, ఇతర సీనియర్‌ అధికారులతో టీపీ దాస్‌ పంపకాలపై చర్చించారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ ప్రక్రియ పూర్తయి రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే అపాయింటెడ్‌ డే జూన్‌ రెండులోగా పోలీస్‌ శాఖలోనూ పంపకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీజీపీ ప్రసాదరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *