
బ్లాక్‌బాక్స్ కోసం గాలిస్తున్నాం
మలేషియా రక్షణ మంత్రి ఇషాముద్దీన్
కౌలాలంపూర్, మార్చి 26 (జనంసాక్షి) :
హిందూ మహాసముద్రంలో కూలిపోయిన వి మానానికి సంబంధించిన శకలాలను గుర్తిం చామని మలేషియా రక్షణ మంత్రి ఇషాముద్దీన్ తెలిపారు. ఆ విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌ని వెదికి పట్టుకునేందుకు చర్యలు వేగవంతమ య్యాయన్నారు. ఈనెల
కౌలాలంపూర్ నుంచి 239 మందితో చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరిన మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అదృశ్యమవగా ఆచూకీ దొరక్కపోవడంతో జలసమాధి అయ్యిందని మలేషియా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపగ్రహాలు తీసిన తాజా చిత్రాల్లో దక్షిణ హిందూ మహా సముద్రంలో మలేసియా విమానం కూలిపోయినట్లు భావిస్తున్న చోట 122 వస్తువులు కన్పిస్తున్నాయని మలేసియా ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 400 చ.కి.మీ. వ్యాసంలో ఇవి చెల్లాచెదురుగా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. విమానం గల్లంతైనప్పటినుంచి ఆ దేశ రవాణాశాఖ మంత్రి నిర్వహిస్తున్న రోజువారీ విలేకరుల సమావేశంలో ఈ విషయం తెలిపారు. అయితే ఆ వస్తువులు మలేసియా విమాన శకలాలేనా అన్నది ఇంకా రూఢీ కావాల్సి ఉందన్నారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన మలేసియన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ 122 వస్తువులను గుర్తించిందని, వాటిల్లో 23 మీటర్లనుంచి మీటరు పొడుగున్న వస్తువుల వరకూ ఉన్నాయని చెప్పారు. ఇవి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి 2,557 కి.మీ. దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. బ్లాక్‌బాక్స్ సిగ్నల్స్‌ని గుర్తించే సామగ్రి అమెరికా నుంచి బుధవారం ఆస్టేల్రియా చేరుకుంది. మరోపక్క ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, చైనా, జపాన్, సౌత్‌కొరియాలకు చెందిన డజనుకు పైగా విమానాలు అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాయి. వాతావరణం అనుకూలించక మంగళవారం నిలిపివేసిన అన్వేషణను బుధవారం తిరిగి కొనసాగిస్తున్నాయి. విమానం ప్రయాణ దిశను ఎందుకు మార్చుకుంది, ఏం జరిగిందన్న దానిపై ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. విమాన శకలాలు, బ్లాక్‌బాక్స్ దొరికితేనే ఏం జరిగిందనేది వెల్లడవుతుందని అన్ని దేశాలూ ఎదురుచూస్తున్నాయి. ఇందుకోసం ఎవరికి వారు తమవంతుగా అన్వేషణలో ముందుకు సాగుతున్నాయి.
శకలాలు గుర్తించాం




