Monday, 2 November 2026

తెలంగాణలో సీపీఎం అభ్యర్థులు వీరే..


హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) :
సహచర కమ్యూనిస్టు పార్టీతో పాటు టీఆర్‌ఎస్‌తో ఎన్నికల ఒప్పందానికి సిద్ధమని చెప్పిన సీపీఎం పార్టీ అవేవి తేలకుండానే తెలంగాణ రాష్ట్రంలో పోటీచేసే తన అభ్యర్థులను ప్రకటించింది. సిపిఐ, టిఆర్‌ఎస్‌తో పొత్తులు ఉంటాయని భావించినా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వారికి ఝలక్‌ ఇచ్చింది. తెలంగాణలో పోటీచేసే సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా నేడు విడు దలయింది. 3 పార్లమెంటు, 5 అసెంబ్లీ స్థానా లకు సీపీఎం అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల నుంచి, భద్రాచలం, మధిర, పాలేరు, మిర్యాలగూడ, ఇబ్ర హీంపట్నం అసెంబ్లీ స్థానాలకు సీపీఎం అభ్యర్థు లను ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఒంటరి పోరు చేసేందుకు సీపీఎం సిద్ధమైంది. లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 3 లోక్‌సభ, 5 అసెంబ్లీ స్థానాలకు సీపీఎం అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ అభ్యర్థులుగా నల్లగొండ – నంద్యాల నరసింహారెడ్డి, భువనగిరి – సీతారాములు, ఖమ్మం – అప్రోజ్‌ సమీన, అసెంబ్లీ అభ్యర్థులు… భద్రాచలం – సున్నం రాజయ్య, మధిర – లింగాల కమల్‌రాజ్‌, పాలేరు – పోతినేని సుదర్శన్‌రావు, మిర్యాలగూడ – జూలకంటి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం – పగడాల యాదయ్య పోటీ చేయనున్నారు. ఒకవేళ పొత్తులు కుదిరితే పోటీకి సంబంధించి తదుపతరి ఆలోచనచేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *