Monday, 2 November 2026

నల్లధనం వెనక్కి రప్పించడంలో కేంద్ర వైఖరిపై సుప్రీం గుస్సా


న్యూఢిల్లీ, మార్చి 26 (జనంసాక్షి) :
భారత్‌కు చెందిన కుభేరులు వివిధ దేశాల్లోని బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పిం చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిం ది. కేంద్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్ల ధనాన్ని స్వదే శానికి రప్పించేందుకు గడిచిన ఆరు దశాబ్దా లుగా ఎలాంటి పర్యలు చేపట్టలేదని కేంద్రా నికి తలంటు పోసింది. విదేశాల్లో మూలు గుతున్న నల్లధనాన్ని భారతదేశానికి తీసుకు వచ్చి ఉంటే దేశంలో ఆర్థిక పరిస్థితి, తలసరి ఆదాయం పెరిగి
ఉండేవని అభిప్రాయపడింది. ఆదాయం పన్ను కూడా తగ్గి ఉండేదని సుప్రీం కోర్టు పేర్కొంది. దేశంలోనూ, వెలుపల ఉన్న నల్లధనంపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ పరంగానే ఇందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *