
గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులు
హైదరాబాద్, మార్చి 28 (జనంసాక్షి) :
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక కోసం నిపుణులతో సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈమేరకు ఐదుగురు సభ్యు లతో కమిటీని ఏర్పాటు చేసింది. సభ్యులుగా కె. శివరామకృష్ణన్, ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, ఆరోమన్ రేవి, డాక్టర్ రతీన్‌రాయ్, ప్రొఫెసర్ జగన్ షాలను నియమించింది. వీరు సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి కొత్త రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. ఆలోపే సీమాంధ్ర ప్రాం తంలో కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. హైదరా బాద్ మాదిరిగా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ఒకేచోట కేంద్రీకృతం చేయ కుండా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సంస్థలు, కార్యాలయాల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉంది. సీమాంధ్రకు కొత్త రాజధానిగా తిరుపతి, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అయితే కొత్త రాజధాని ఒకచోట, రాష్ట్ర హైకోర్టు మరో చోట ఏర్పాటు చేసేందుకు అధ్యయనం జరు పుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌కు ఇద్దరు సలహా దారులను నియమించింది. రాజస్థాన్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సలావుద్దీన్ అహ్మద్, మహారాష్ట్ర మాజీ డీజీపీ ఏఎస్ రాయ్‌లను కేంద్రం నియమించింది. వీరిద్దరు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో
గవర్నర్‌కు సలహాలిస్తారు. రాయ్ శాంతిభద్రతలను, సలావుద్దీన్ సాధారణ పరిపాలనను పర్యవేక్షిస్తారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి, డీజీపీ ప్రసాదరావు నేతృత్వంలో అధికారులు పాలన, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలను నివేదిస్తారు.
అవశేష ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సర్చ్ కమిటీ




