Monday, 2 November 2026

గుజరాత్‌ అభివృద్ధి గాలిబుడగే


అది పేలిపోతుంది : రాహుల్‌
వార్దా, మార్చి 28 (జనంసాక్షి) :
గుజరాత్‌ అభివృద్ధి నమూనా వట్టి గాలిబు డగేనని, అది పేలిపోవడం తథ్యమని కాంగ్రె స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తేల్చిచె ప్పారు. శుక్రవారం మహారాష్ట్రలోని వార్దాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్‌డీఏ అధికారంలో ఉన్నప్పుడు భారత్‌ వెలిగిపోతుందంటూ 2004లో చేసిన ప్రచారం దూది పింజలా తేలిపోయిందని అన్నారు. 2009లోనూ ఎన్‌డీఏ మరో గాలిబుడగను తయారు చేస్తే అదీ పేలిపోయిందని గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్‌ అభివృద్ధి నమూనా అనే మరో గాలిబుడగను తయారు చేశారని, దానిలో నింపిన గ్యాస్‌ త్వరలోనే బ్లాస్ట్‌ అవుతుందని తేల్చిచెప్పారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనా పేరుతో బీజేపీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చేస్తున్న ప్రచారాన్ని రాహుల్‌ తిప్పికొట్టారు. 17 శాతం జీడీపీ మహారాష్ట్ర నుంచి వస్తుందని ఆయన అన్నారు. దేశంలోనే అభివృద్ధిలో మహారాష్ట్ర నంబర్‌ వన్‌గా ఉందని తెలిపారు. అంటే గుజరాత్‌ అభివృద్ధి నమూనా ఇంకెక్కడుందో చెప్పాలంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనలో పాదర్శకతను తీసుకువచ్చేందుకు కృషి చేసిందని అన్నారు. సమాచార హక్కుచట్టం ద్వారా పాలనవ్యవస్థలో జవాబుదారీ తనాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారాలతో ఆర్భాటం చేస్తున్న బీజేపీ మళ్లీ ఓటమి పాలవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *