బాబు టీడీపీ ఆంధ్రా పార్టీయే : కేసీఆర్
హైదరాబాద్, మార్చి 29 (జనంసాక్షి) :
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, బంగారు తెలంగాణను తయారు చేసుకోవడం సాధ్యమవుతుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్క యువకుడు, విద్యార్థి ఈ విషయాన్ని గుర్తించి టీఆర్‌ఎస్ గెలుపునకు కృషి చే యాలన్నారు. నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వచ్చి న నేతలు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరా రు. నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గానికి చెం దిన నేత పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆయనతో పాటు పలువురు స్థానిక నేతలను కూడా కేసీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా
వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్ డెప్యూటీ మాజీ ఛైర్మన్, 10 మంది మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తదితరులు ఆ పార్టీలో చేరారు. కొండా సురేఖ దంపతుల సమక్షంలో వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మరోమారు పొన్నాలపై ఫైర్ అయ్యారు. కొత్త రాష్ట్రంలో కొత్త నాయకత్వం ఆధ్వర్యంలో కొత్త పంథాలో అభివృద్ధి చేసుకుందామని చంద్రశేఖర్‌రావు అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా దుర్మార్గాలు చేశాయి. కొత్త రాష్ట్రం.. కొత్త నాయకత్వం.. కొత్త పంథాలో అద్భుతాలు చేసి ప్రజలకు చూపించాలి. టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళిక డ్రాఫ్ట్ తయారైంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే పునర్‌నిర్మాణం సాధ్యమ్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తిచేయకుండా అక్రమ ప్రాజెక్టులకు అనుమతులిచ్చి నీళ్లు తరలించింది పొన్నాల కాదా అని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులంటే శ్రమదోపిడే. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యూలరైజ్ చేస్తం. రైతులకు లక్ష రుణమాఫీ కావాలన్నా, వికలాంగులకు, వద్ధులకు వెయ్యి రూపాలయ పెన్షన్ కావాలన్నా టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. పొన్నాల కారణంగానే తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందన్నారు. గతంలో టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలను మనం చూడంది కాదని, మళ్లీ అవే ప్రభుత్వాలు అవసరమా అని ప్రశ్నించారు. టిడిపి ఎప్పటికీ ఆంధ్రా ప్రభుత్వమేనన్నారు. కొత్త రాష్ట్రం.. కొత్త నాయకత్వం.. కొత్త పంథా ఇక నుంచి ఇదే మన నినాదం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణాలో రైతు రుణాల మాఫీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పేదలకు విద్య ఇవన్నీ సాకారం కావాలంటే తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఏర్పడాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున కోటి ఎకరాలను సాగులోకి తీసుకొస్తాం. యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందాం’ అని తెలిపారు. అలాగే వరంగల్‌లో మూతపడ్డ ఆజంజాహీ మిల్‌ను తెరిపిస్తామన్నారు. వరంగల్ పత్తికి ప్రధాన కేంద్రమని అన్నారు. అక్కడ పత్తి మిల్లులను స్థాపిస్తామన్నారు. తనకు తెలంగాణ అభివృద్దిపై ఎన్నో ఆశలు ఉన్నాయన్నారు. ఇక టిడిపి చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రా నేత తప్ప తెలంగాణ నేత కాజాలడన్నారు. పోలవరం డిజైన్ మార్పు, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ, దుమ్ముగూడెం టేల్ పాండ్ పై బాబు వైకరేమిటో చెప్పాలన్నారు. సీమాంధ్ర బాబుకు చెందిన టీడీపీకి తెలంగాణలో చోటులేదన్నారు.





