
మతసామరస్య విఘాతానికి మోడీ కుట్ర
ఎన్‌డీఏ దేశానికి ఏం చేసింది
సోనియా సవాల్
దిస్పూర్, మార్చి 30 (జనంసాక్షి) :
భారతీయులందరిదీ గంగాజమున తహజీబ్ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. దేశంలో మతసామరస్యానికి విఘాతం కల్పించేందుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కుట్ర పన్నుతున్నారని ఆమె తెలిపారు.
బీజేపీ మాటలకు, చేతలకు మధ్య తేడా తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ చెప్పిందే చేస్తుందని, చేసిందే చెప్పుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలోని లక్ష్మీపూర్‌లో ఆదివారం జరిగిన సభలో సోనియా ప్రసంగించారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ ముఖ్యపాత్ర పోషించిందని ఆమె పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హావిూ, ఆహార భద్రత తదితర చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. అంతే కాకుండా గిరిజనుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తెచ్చామన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ నెరవేర్చిందని, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను కూడా అమలు చేస్తామని చెప్పాకాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ 2 ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. దాదాపు అన్ని హావిూలను నెరవేర్చి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. అనేక రంగాల్లో తాము విజయం సాధించామని, కానీ కొన్ని రంగాల్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయామని సోనియా పేర్కొన్నారు. అయితే తాము నిజాయితీగా పనిచేయగలిగామన్న సంతృప్తి ఉందన్నారు. గత ప్రభుత్వాలకంటే అనేక రంగాల్లో తమ ప్రభుత్వ పనితీరు బాగుందని ప్రధాని పేర్కొన్నారు. మెరుగైన పాలన అందించేందుకు కృషి చేశామన్నారు. ఆర్థికంగా కొంత వెనకబడ్డా అంతర్జాతీయ పరిసక్తితుల కారణంగా రాజీపడక తప్పలేదన్నారు. అయితే పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి ముందుకు తీసుకుని వెల్లామన్నారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నామన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. కాంగ్రెస్‌పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సోనియాగాంధీ పేర్కొన్నారు. ప్రజలు కలిసి ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటే, ప్రజల అనైక్యతను బీజేపీ కోరుకుంటుందని సోనియా తెలిపారు. అధికార దాహంతో బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.




