Monday, 2 November 2026

రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు నాదే బాధ్యత : గవర్నర్‌

రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) :

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత తనేదనేనని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. జయ నామ సంవత్సరంలో అందరికి జయం కలగాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం అందరికీ సంతోషమే ఉంటుందని ఆయన తెలిపారు. ఏడాదంతా సౌభాగ్యమే విలసిల్లాలని కోరారు. జయ నామ సంవత్సరాన్ని భక్తి సంవత్సరంగా పాటించాలని సూచించారు. కష్టపడి సాధించేది జయమని, కష్టపడకుండా భగవంతుడు ఇచ్చేది జయమని గవర్నర్‌ అభివర్ణించారు. తన జీవితంలో ఈ ఉగాది ఎంతో ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను 60 రోజుల్లో పార్లమెంట్‌ ఆమోదించాల్సి ఉందన్న విషయంపై రాష్ట్రపతికి లేఖ రాశారని చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *