
పేదలకు మంచినీళ్లు లేవు : కేజ్రీవాల్
న్యూఢిల్లీ, మార్చి 30 (జనంసాక్షి) :
గుజరాత్‌లో అధానీ గ్రూప్, అంబానీలదే అభివృద్ధి అని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్ అభివృద్ధి నమూనాపై బీజేపీ నాయకత్వం చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని ఆయన తేల్చిచెప్పారు. గుజరాత్‌లో ప్రజలకు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా లేవని, మురికినీటిని తాగుతూ అక్కడి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ అభివృద్ధిని మోడీని ప్రజల అభివృద్ధి చూపడం సరికాదన్నారు. మోడీకి అధికారమిస్తే కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశాన్ని పెట్టినట్లేనని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తాను వారణాసిలో మోడీపై పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. బీజేపీ కార్యకర్తలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొంటానని బదులిచ్చారు.




