
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 1 (జనంసాక్షి) :
భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపు ఖరారైంది. రాష్ట్రంలో మసకబారిన తన ప్రతిష్టను మోడీ హవాతో పునరుద్దరిం చుకోవా లని ఆరాటపడుతున్న చంద్రబాబునాయుడు ఈమేరకు బీజేపీ అగ్రనాయక త్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కొంతమేరకు సక్సెస్ అయ్యారు. టీడీపీతో పొత్తు ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీతో పొత్తుకు తుది రూపు ఇచ్చేందుకు సిద్ధపడింది. టీడీపీతో కాకుండా టీఆర్ఎస్తో కలిసి వెళ్తే లాభమంటూ టీ బీజేపీ చేసిన ప్రతిపాదననూ అధినాయకత్వం తోసి పుచ్చింది. టీడీపీ పొత్తు ఖరారైనట్టేనని చెప్తోండగా, టీ బీజేపీ మాత్రం ఇంకా అలాంటిదేమి లేదని కొట్టి పారేస్తుంది. 45 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. ఇరు పక్షాల నాయకులు మంగళవారం ఢిల్లీలో అకాలీదళ్ రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ నివాసంలో భేటీ అయ్యారు. రాజ్యసభలో బీజేపీ పక్షనేత అరుణ్‌జైట్లీ ఎన్నికల ప్రచారంలో ఉండటం, బీజేపీ జాతీయాధ్యక్షుడు
బుధవారం ఢిల్లీకి చేరుకోనుండటంతో నేడు సాయంత్రం పొత్తుపై లాంఛనంగా ప్రకటన వెలువడవచ్చని సమాచారం. బీజేపీ చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాలు కచ్చితంగా తమకే ఇవ్వాలని పట్టుబడుతోంది. బుధవారం తెలంగాణలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో నేటిలోగా పొత్తుల వ్యవహారాన్ని తేల్చేయాలని ఇరు పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. సీమాంధ్రలో పొత్తుపై ఇంకా ఎలాంటి ప్రతిపాదలకు తుదిరూపం రానట్టుగా సమాచారం. మొదట తెలంగాణలో పొత్తు విషయాన్ని తేల్చిన తర్వాత సీమాంధ్రలో నోటిఫికేషన్ వచ్చేనాటికి అక్కడి పొత్తుపై ఒప్పందం చేసుకోవాలనే ఆలోచనలో ఇరు పార్టీలు ఉన్నట్లుగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షుడు కె. హరిబాబు అక్కడి నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకొని పొత్తులపై మంతనాలు సాగిస్తున్నారు. సీమాంధ్రలో బీజేపీ 8 అసెంబ్లీ, 3 లోక్‌సబ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ సిద్ధమైంది. కాగా బీజేపీ మాత్రం 18 నుంచి 20 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాలను ఆశిస్తోంది. తిరుపతి, రాజంపేట, నర్సాపూర్ స్థానాలు టీడీపీ ఇవ్వజూపగా వాటితో పాటు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి స్థానాలను కావాలని కోరుతోంది. దీనిపై బుధవారం సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశముందని టీ టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కూటమిదే విజయమని వారు పేర్కొన్నారు.
భాజపా, తెదేపా మధ్య పొడవనున్న పొత్తు




