Monday, 2 November 2026

రెపో రేట్‌ యథాతథం


ముంబయి, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి)
ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీలో రెపోరేటుతో పాటు రివర్స్‌ రెపోరేటు ను యథాతథంగా ఉంచింది. భారీ గా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అ దుపు చేసేందుకే కీలక వడ్డీ రేట్లను మార్చలేదని ఆర్బీఐ గవర్నర్‌ రఘు రామ్‌ రాజన్‌ మంగళవారం ముంబ యిలో వెల్లడించారు. ప్రస్తుతం రెపో రేటు 8శాతంగా ఉండగా రివర్స్‌ రె పోరేటు ఏడు శాతంగా ఉంది. భారీ గా పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని కట్ట డి చేసేందుకే కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. అయి తే అసవరమైనప్పుడు చర్య లు తీసుకుంటామని ఆయ న అన్నారు. కిందటి మాని టరీ పాలసీలో కీలక వడ్డీరే ట్లను 7.75శాతం నుంచి 8శాతానికి పెంచిన సంగతి విధితమే. గత నవంబర్‌లో 11.24శాతం పెరిగిన ద్ర వ్యోల్భణం ఇపుడిప్పుడే ని యంత్రణలోకి వస్తుందని ఆయన అన్నారు. 2012- 13 ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి రేటు మాత్రం 4.5శాతానికి తగ్గిందని ఈ ఆర్ధిక సంవత్సరం అది 4.9 శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది. కరెంటు ఖాతా లోటు అదుపులోకి వచ్చినం దున పసిడి దిగుమతులపై నిబంధ నలు మరింత సరళం కానున్నాయి. రిజర్వు బ్యాంకు వెల్లడించనున్న పర పతి విధాన సమీక్ష తర్వాత బంగా రంపై నిబంధనలను
ప్రభుత్వం మరింత సరళం చేయగలదని ఆర్థిక మంత్రి చిదంబరం సంకేతాలు అందించారు. ‘పుత్తడి దిగుమతులకు మరిన్ని బ్యాంకులను అనుమతించి ఇప్పటికే కొంత మేరకు నిబంధనలను సరళం చేశాం. రిజర్వు బ్యాంకుతో సంప్రదించి నిబంధనలను మరింత సరళం చేసే అంశాన్ని పరిశీలిస్తాం’ అని అన్నారు. ఆర్థిక వ్యవస్థపై వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 20 నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా, స్థిరంగా ఉందని, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సీఏడీ 3,500 కోట్ల డాలర్లకు పరిమితం కాగలదని భావిస్తున్నట్లు చెప్పారు. బంగారం దిగుమతులు 845 టన్నులకు చేరడంతో 2012-13కు జీడీపీలో కరెంట్‌ ఖాతా లోటు రికార్డు స్థాయిలో 4.8 శాతానికి పెరిగింది. 8,820 కోట్ల డాలర్లుగా నమోదైంది. 2014, మే నెలలో 162 టన్నులున్న పసిడి దిగుమతులు నవంబరు నెలకు 19 టన్నులకు తగ్గాయి. 2013, ఫిబ్రవరిలో ఈ దిగుమతులు 524 కోట్ల డాలర్లు ఉన్నాయి రిజర్వు బ్యాంక్‌ త్రైమాసిక రుణ సమీక్ష నేపథ్యంలో ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్‌ 60 పాయింట్ల వృద్ధితో 22446 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 6721 వద్ద ముగిసాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 22485 పాయింట్ల గరిష్టస్థాయిని 22295 పాయింట్ల కనిష్ట స్థాయిని, నిఫ్టీ 6732 గరిష్ట స్థాయిని, 6675 కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. సూచీ ఆధారి కంపెనీ షేర్లలో అత్యధికంగా కెయిర్న్‌ ఇండియా 3.59, విప్రో 3.29, పవర్‌ గ్రిడ్‌ 2.86, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2.23, టీసీఎస్‌ 2.04 శాతం లాభాల్ని సాధించాయి. సీపీసీఎల్‌, హిండాల్కో, కొటాక్‌ మహీంద్ర, మారుతి సుజుకీ, ఏషియన్‌ పేయింట్స్‌ 2 శాతానికి పైగా నష్టాలతో ముగిసాయి. తైమ్రాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లలో ఏలాంటి మార్పులు చేయకుండా రిజర్వు బ్యాంక్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *