
మెదక్ జిల్లాను మూడుగా విభజిస్తా
అవినీతికి వ్యతిరేక పోరాటం
ప్రతి జిల్లాకు వంద పడకల ఆస్పత్రి
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
మెదక్, ఏప్రిల్ 1 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంపై నాలుగు కోట్ల మంది ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని టీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తె లంగాణ ప్రజల ఆశలు నెరవేరా లంటే తొలి తెలంగాణలో తమ ప్రభుత్వమే ఉండాలని టీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. గుడ్ గవర్నె న్స్ ముఖ్యమని, అందుకు కచ్చి తంగా కృషి చేసి అవినీతిని అం తం చేస్తామన్నారు. అవినీతి గద్ద లను ఏరి పారేస్తామన్నారు. తన
కొడుకైనా క్షమించమన్నారు. మెదక్ జిల్లా బిడ్డగా తెలంగాణ సాధించానన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమని అంటూ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించిన టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలన్నారు. పద్నాలుగేళ్లు కష్టపడి తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. ఇలా సాధించుకున్న విజయం సార్థకం కావాలని నిరర్థకం కాకూడదని ఆయన తెలిపారు. కొత్త రాష్ట్రం.. కొత్త పంథాతో ముందుకు పోవాలన్నారు. రాబోయే రెండుమూడు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. మెదక్ జిల్లా జోగిపేటలో తొలి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైద్యం అందించేందుకు ప్రభుత్వ హయాంలోనే ఆస్పత్రులను పటిష్టం చేస్తామన్నారు. ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రి, నియోజకవర్గంలో వంద పడకలు ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా అభివృద్ది చేస్తామన్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాలు అవుతాయన్నారు. నిమ్స్ లాంటివి వంద పడకల కూడిన 24 ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ వస్తదనే నమ్మకం ఎవరికీ లేకుండే కానీ మనం కష్టపడి ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నామని వెల్లడించారు. సింగూరు కెపాసిటీ పెంచైనా సరే జోగిపేటకు నీళ్లు రప్పిస్తామని, జోగిపేటలోని లక్ష ఎకరాలకు సాగునీటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ కూడా కృష్ణా బేసిన్లో ఉందని, హైదరాబాద్‌కు కూడా నీళ్లు కష్ణా నది నుంచే రావాలని తెలిపారు. సీమాంధ్రుల పాలనలో 400 కిలోవిూటర్ల పొతిరెడ్డిపాడు పనులు చకచకా పూర్తవుతది కానీ తెలంగాణలో చిన్న కాలువ పని కూడా పూర్తికాదేందుకు అని ప్రశ్నించారు. తెలంగాణాలో రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్,టిడిపి ప్రభుత్వాలే కారణమన్నారు. తెలుగు దేశం తెలంగాణ పార్టీ కాదన్నారు. అది ఎప్పటికైనా ఆంధ్రాపార్టీ అని కేసీఆర్ విమర్శించారు. టీడీపీకి ఓటేస్తే ఆంధ్ర నాయకులకు మద్ధతు ఇచ్చినట్టే. అందుకే తెలంగాణ పార్టీలకు ఓటేయాలి. వారికి ఓటేస్తే వారి ప్రజల కోసమే పనిచేస్తారు. ఆంధ్రాపార్టీలకు తెలంగాణలో స్థానంలేదని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి. రాజకీయ అవినీతి అంతమే కేసీఆర్ లక్ష్యమని మనవి చేస్తున్నానని చెప్పారు. అప్రమత్తంగా ఉండండి, ఆగం కాకండి. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే రావు. ఆవులకే గడ్డేయాలి, ఆవుపాలు పిండి కడుపునిండా తాగాలి. అంతేగానీ సీమాంధ్రులకు కొమ్ము కాయగూడదన్నారు. కొట్లాడినోళ్లకే ఓటేస్తే వారు అండగా ఉంటారని అన్నారు. పద్నాలుగేళ్లు తెలంగాణ పోరాటంలో ఎన్నో అవమానాలు, చీత్కారాలు అనుభవించి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. ఇక బంగారు తెలంగాణను తయారు చేసి తెలంగాణ ప్రజలకు అందించడమే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. పేదలకు ఉచిత విద్యను అందించడం తన చిరకాల వాంఛ అని వెల్లడించారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ ఖర్చులతోనే విద్యను అందిస్తామని పేర్కొన్నారు. చిన్న పిల్లల చదువు బాధ్యత స్థానిక పోలీసులకు అప్పగిస్తామని ఎవరైన పిల్లలు బడికి వెళ్లకుండా ఉంటే ఆ పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేదలకు డబుల్ బెడ్రూం హాల్, కిచెన్‌తో ఇళ్లు నిర్మించి ఇస్తామని వాగ్ధానం చేశారు. బడుగు, బలహీన వర్గాలవారు ఆత్మగౌరవంతో బతికేలా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గిరిజనులు తమ సంస్కతి, సాంప్రదాయాలను కాపాడుకునేలా వారి తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేస్తామని తెలిపారు. ఇక విభజన సందర్భంలో ఉద్యోగలుకు ఆప్షన్లు ఇవ్వడం సరికాదన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేసి, బంగారు తెలంగాణను తయారు చేసుకోవం సాధ్యమవుతుందని కెసిఆర్ పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్క యువకుడు, విద్యార్థి ఈ విపసయాన్ని గుర్తించి టిఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలన్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త నాయకత్వం ఆధ్వర్యంలో కొత్త పంథాలో అభివృద్ధి చేసుకుందామని చంద్రశేఖర్‌రావు అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా దుర్మార్గాలు చేశాయి. కొత్త రాష్ట్రం.. కొత్త నాయకత్వం.. కొత్త పంథాలో అద్భుతాలు చేసి ప్రజలకు చూపించాలి. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే పునర్నిర్మాణం సాధ్యమ్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తిచేయకుండా అక్రమ ప్రాజెక్టులకు అనుమతులిచ్చి నీళ్లు తరలించింది పొన్నాల కాదా అని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులంటే శ్రమదోపిడే. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యూలరైజ్ చేస్తం. రైతులకు లక్ష రుణమాఫీ కావాలన్నా, వికలాంగులకు, వద్ధులకు వెయ్యి రూపాలయ పెన్షన్ కావాలన్నా టీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. పొన్నాల కారణంగానే తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందన్నారు. గతంలో టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలను మనం చూడంది కాదని, మళ్లీ అవే ప్రభుత్వాలు అవసరమా అని ప్రశ్నించారు. టిడిపి ఎప్పటికీ ఆంధ్రా ప్రభుత్వమేనన్నారు. కొత్త రాష్ట్రం.. కొత్త నాయకత్వం.. కొత్త పంథా ఇక నుంచి ఇదే మన నినాదం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణాలో రైతు రుణాల మాఫీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు,పేదలకు విద్య ఇవన్నీ సాకారం కావాలంటే తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఏర్పడాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున కోటి ఎకరాలను సాగులోకి తీసుకొస్తాం. జోగిపేటలో చెరకు రీసెర్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. జోగిపేటలో జరుగుతున్న టీఆర్ఎస్ సభలో భీమ్రావు పాటిల్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ జరుగుతున్న సభలో ఆయనకు టీఆర్ఎస్ అధినేత గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. సభాప్రాంగణానికి కె. చంద్రశేఖర్‌రావు హెలికాప్టర్లో చేరుకోగానే ప్రజలు జయజయ నినాదాలతో కేసీఆర్‌కు చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. హెలికాప్టర్ కిందకు దిగాక కేసీఆర్ సభావేదికపైకి చేరుకున్నారు. మాణిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కరణం ఉమాదేవి, హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు అశేషంగా హాజరయ్యారు.




