Tuesday, 3 November 2026

రాయ’బరి’లో సోనియా


తనయుడి డ్రైవింగ్‌

సింపుల్‌గా నామినేషన్‌
రాయబరేలీ, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) :
యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన సొంత నియోజకవర్గం రాయబరేలి నుంచి మరోమారు పోటీ చేయబోతున్నారు. ఈ మేర కు బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో నామినేషన్‌ దాఖలు చేశారు. యూపీఏను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పట్టుదలగా ఉన్న ఆమె తన సొంత నియోజకవర్గమైన రా యబరేలి నుంచి ముచ్చటగా మూడోసారి పోటీకి సిద్ధం అయ్యారు. పార్టీ ఉపాధ్యక్షుడు, తన కుమారుడు రాహుల్‌గాంధీ సమక్షంలో సోనియాగాంధీ తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచా రంలో పాల్గొన్నారు. ప్రేమాభిమానాలతో దత్తత తీసుకున్న రాయ్‌ బరేలి ప్రజలు మరోసారి ఘనవిజయాన్ని
అందిస్తారని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత క్లుప్తంగా విూడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకోవడానికి ముందు ఫురసత్‌ గంజ్‌ ఎయిర్‌ పోర్ట్‌లో సోనియాకు ఘన స్వాగతం పలికారు. రాహుల్‌ స్వయంగా కారు నడపగా సోనియా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా నామినేషన్‌ కార్యక్రమంలో గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సతీష్‌ శర్మ పాల్గొన్నారు. 1960 నుంచి ప్రతి ఎన్నికల్లో నెహ్రూ, గాంధీల కుటుంబం రాయ్‌ బరేలి నియోజకవర్గంలో విజయం సాధిస్తోంది. తన భర్త ఫిరోజ్‌ గాంధీ మరణం తర్వాత తొలిసారి ఇందిరా గాంధీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు. సోనియాగాంధీ మూడు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆస్తుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన 2004 ఎన్నికల్లో సోనియాగాంధీ అమేథి నుంచి రాయ్‌బరేలికి మారారు. గతంలో బళ్లారి నియోజకవర్గంలో సుష్మా స్వరాజ్‌ను సోనియాగాంధీ ఓడించిన సంగతి తెలిసిందే. అయితే బరేలిలో ఎమర్జెన్సీకాలంలో ఇందిరాగాంధీ 1978లో రాజ్‌నారాయణ చేతిలో ఓడిపోయారు. ఇదిలావుంటే తన నియోజకవర్గం అమేథీలో జరిగిన అభివృద్ధిని ఇతర పార్టీ నాయకులు ప్రశంసించడం పట్ల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. అమేథీలో అభివృద్ధి పనులు కొనసాగిస్తామని ఆయన చెప్పారు. అమేథీలో జరిగిన అభివృద్ధి గురించి తన సోదరుడు, బీజేపీ నాయకుడు వరుణ్‌ గాంధీ చెప్పిందంతా నిజమేనని అంగీకరించారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల రాహుల్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల, మహిళల సాధికారత కోసం వ్యూహాత్మకంగా పనిచేశామని వివరించారు. ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. తన నియోజకవర్గమైన అమేథీలో జరిగిన అభివృద్ధిని ఇతర పార్టీ నాయకులు ప్రశంసించడం స్పూర్తినిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. అమేథీలో అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తామని హావిూ నిచ్చారు. అమేథీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై తన సోదరుడు, బీజేపీ నేత వరుణ్‌గాంధీ చెప్పినదంతా వాస్తమేనని కితాబిచ్చారు. అమేథీలో రైతులు, మహిళల సాధికారత కోసం వ్యూహాత్మకమైన ప్రణాళికలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఫలితాలను రాబట్టాయని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *