గవర్నర్ మార్క్ నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) :పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేస్తూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ ద్వారా పలువురు అభ్యర్థులు ర్యాంకులు పొందినట్లుగా సీఐడీ విచారణలో తేల డంతో గవర్నర్ తన మార్క్ నిర్ణయంతో ప్రవేశ పరీక్షను రద్దు చేసేశారు. ఎన్టీఆర్ హె ల్త్ యూనివర్సిటీ వివిధ పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం మార్చి 2న అర్హత పరీక్ష నిర్వహించింది. రాష్ట్రంలోని వేలాది మంది జూనియర్ డాక్టర్లు ఈ ప్రవేశప రీక్షకు హాజరయ్యారు. ప్రశ్నపత్రం కఠినంగా ఉండటంతో అత్యధికంగా 150 మా ర్కుల వరకు రావొచ్చంటూ వారు లెక్కలు వేసుకున్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ కొందరికి 180 మార్కులకు పైగా వచ్చాయి. వారి ట్రాక్ రికా ర్డులను పరిశీలిస్తే ఒక్కొక్కరు ఎంబీబీఎస్ గట్టెక్కేందుకు ఏళ్లకేళ్లు పరీక్షలు రాసినట్టుగా తేలింది. దీంతో జూనియర్ డాక్టర్లు గవర్నర్‌ను కలిసి ప్రవేశ పరీక్షలో అక్రమాలు జరి గినట్టుగా ఫిర్యాదు చేశారు. స్పందించిన గవర్నర్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణు గోపాల్‌రెడ్డిని ప్రాథమిక విచారణకు ఆదేశించారు. ఆయన నివేదిక ఆధారంగా సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని అధికారుల బృం దం రోజుల వ్యవధిలోనే కుంభకోణం గుట్టురట్టు చేసింది. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన వర్జిన్ కన్సల్టెన్సీ ప్రశ్నపత్రాలు ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ నుంచే ప్రశ్నాపత్రాలు బయటికి వచ్చినట్టుగా తేల్చారు. ఒక్కో అభ్యర్థి నుంచి కోటి రూపాయల నుంచి 1.20 కోట్ల రూపాయల వరకు
వసూలు చేసి వర్జిన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు వారి ప్రశ్నపత్రాలు అందజేసినట్టుగా నిర్ధారించారు. ఆ సంస్థకు చెందిన ఇద్దరు బ్రోకర్లతో పాటు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారం రూ.50 కోట్ల నుంచి రూ. 70 కోట్లకు పైగా చేతులు మారినట్టుగా తేల్చారు. కుంభకోణంలో అంజూసింగ్ ప్రధాన నిందితురాలు కాగా సాయినాథ్, మునీశ్వర్‌రెడ్డి బ్రోకర్లుగా వ్యవహరించారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేయాల్సి ఉంది. పీజీ మెడికల్ ఎంట్రన్స్ రద్దుతో త్వరలోనే మళ్లీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ త్వరలోనే తేదీలను ప్రకటించనుంది. అయితే కొందరు చేసిన పాపానికి తామంతా బాధ్యత వహించాలని జూనియర్ డాక్టర్లు వాపోతున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రవేశపరీక్ష అంటే అది తమపై భారం మోపడమేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




