
బాబువి వెయ్యి కళ్లు మోడీ వైపే : నారాయణ
తెలంగాణ సీపీఐ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 3 (జనంసాక్షి) :
రాబోయే సార్వత్రిక ఎన్ని కల్లో ప్రజలు తమకు అవ కాశం కల్పిస్తే ముస్లింలకు సబ్ ప్లాన్ తెస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయ ణ తెలిపారు. గురువారం ఆయన పార్టీ తెలంగాణ శాఖ
మేనిఫెస్టో విడుదల చేవారు. కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీది పొత్తు కాదని కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు. చర్చల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుందన్ని ఆయన అన్నారు. గురువారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మేనిఫెస్టోను నారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కాంగ్రెస్‌తో సర్దుబాటుకు అంగీకరించామన్నారు. తెలంగాణ మినహా దేశమంతా తాము కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే పోరాడుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతం కాస్తా వెయ్యికళ్లతో బీజేపీ వైపు వెళుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ మోడీతో చేతులు కలపటం దురదృష్టకరమన్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్‌తో వన్‌సైడ్‌లవ్‌లో ఉన్నారని ఆయన అన్నారు. పేదలకు భూపంపిణీ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌తోపాటు ప్రతి గ్రామంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలనే పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు మాత్రమే ఉంటుందని పొత్తు కాదని, సీట్ల సర్దుబాటుపై చర్చల్లో కొంత ప్రతిష్టంభన నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. సీమాంధ్రలో సీపీఎంతో పొత్తుపై సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు. అయితే అవి ఎంతమేరకు ఫలిస్తాయో చూడాలన్నారు.
ముస్లింలకు సబ్ ప్లాన్




