
విభజన కమిటీతో సీఎస్, గవర్నర్ సలహాదారుల సమీక్ష
(జనంసాక్షి) :
తెలంగాణ, ఆంధ్రప్ర దే శ్ రాష్ట్రాల మధ్య పంప కాల ప్రక్రియ మరింత వేగం అందుకుంది. అ పాయింటెడ్ డే జూన్ రెండులోగా ఉద్యోగు లు, ఆస్తులు, అప్పులు ఇతర కీలక పంపకాలు పూర్తి చేయాలనే లక్ష్యం
తో విభజన కమిటీ చకచకా పావులు కదుపుతోంది. రాష్ట్ర విభజన కమిటీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, గవర్నర్ సలహాదారు సమావేశమయ్యారు. సచివాలయంలో భేటీలో విభజన పక్రియ పురోగతిని సవిూక్షిస్తున్నట్లు సమాచారం. వివిధ అంశాలపై రాయ్, అహ్మద్‌తో చర్చించారు. ఇదిలావుంటే సీమాంధ్ర సిఎంకు ఛాంబర్ కేటాయింపుపై ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించారు. హెచ్ బ్లాక్ తదితర బ్లాక్‌లను పరిశీలించారు. రక్షణ పరంగా కూడా అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకునేలా ఛాంబర్ అన్వేషణ సాగుతోంది. సచివాలయంలో గవర్నర్ సలహాదారులు ఏఎన్.రాయ్, సలావుద్దీన్ అహ్మద్‌లతో నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ భేటీ అయ్యారు. తనకుతానుగా పరిచయం చేసుకున్న శర్మ నగరంలో శాంతి భద్రతలు, తదితర అంశాలపై గవర్నర్ సలహాదారులు చర్చించినట్లు సమాచారం. విభజనతో పాటు, ఎన్నికల అంశాలపైనా వీరు చర్చించి ఉంటారని సమాచారం.
పంపకాలు చకచకా




