Monday, 2 November 2026

‘ఆత్మ’ మెడకు టైటానియం ఉచ్చు


వెంటాడుతున్న వైఎస్‌ పాపాలు
కేవీపీపై అభియోగాలు నమోదు చేసిన అమెరికా ఫెడరల్‌ కోర్టు
చికాగో/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (జనంసాక్షి) :మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సన్నిహితుడు, ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావు మెడకు ట ైటానియం ఉచ్చు బిగుస్తోంది. రాష్ట్రంలోని టైటానియం ఖనిజ నిక్షేపాలను విలి కి తీసేందుకు అనుమతి కోసం అమెరికన్‌ కంపెనీ భారత అధికారులకు 1.85 లక్షల అమెరికన్‌ డాలర్లు ముడుపుల రూపంలో చెల్లించినట్లు అమె రికాలోని ఫెడరల్‌ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. 2013లో ఫెడరల్‌ కోర్టుకు దీనిపై విచారణ జరిపిన దర్యాప్తు బృందం నివేదిక సమర్పించినట్లుగా తెలిసింది. హవాలా రూపంలో సదరు మొత్తాన్ని
తరలించడంపై కేవీపీతో పాటు హంగేరీ వ్యాపారి ఆండ్రాస్‌నోవ్‌ (75), ఉక్రెయిన్‌కు చెందిన సురేన్‌ గెవోర్జియాన్‌, ప్రవాస భారతీయుడు గజేంద్రలాల్‌, శ్రీలంకకు చెందిన పెరియస్వామి సుందరలింగంపై దర్యాప్తు బృందం అభియోగాలు నమోదు చేసింది. ఉక్రెయిన్‌ దేశీయుడైన డిమిట్రీ షిర్తావ్‌ను మార్చి 12న వియన్నాలో అరెస్టు చేశారు. టైటానియం అమ్మకాల ద్వారా ఏటా 50 కోట్ల ఆదాయం పొందాలనేది చికాగో ప్రధాన కార్యాలయంగా ఉన్న కంపెనీ ఏ ప్రాజెక్టు లక్ష్యంగా దర్యాప్తు బృందం ఆక్షేపించింది. టైటానియం మైనింగ్‌ కుంభకోణంలో షికాగో న్యాయస్థానం తనపై అభియోగాలు మోపడంపై కేవీపీ రామచంద్ర రావు స్పందించారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదో పత్రికా కథనమే తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. దర్యాప్తు సంస్థ తన నివేదికను బయటపెట్టాలని కోరారు. అమెరికా న్యాయ విభాగం, దర్యాప్తు సంస్థ నివేదిక అందాక మాట్లాడతానని చెప్పారు. దివంగత వైయస్‌ రాజశేఖర రెడ్డి తన హృదయంలోనే ఉన్నారని, తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్‌ కార్యకర్తనని ఆయన చెప్పారు. నిరాధార ఆరోపణలపై తాను వ్యాఖ్యానించనని, వివరాలు అందాక తన అభిప్రాయం చెబుతానని అన్నారు. కాగా, కెవిపి రామచందర్‌ రావుపై మీడియా గురువారం బాంబు పేల్చిన విషయం తెలిసిందే. తెలుగులోని రెండు ప్రముఖ తెలుగు దినపత్రికల్లో కెవిపి రామచందర్‌ రావుపై అమెరికాలోని చికాగోలో కేసు నమోదైన విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఎన్నికల వేళ కాంగ్రెసుకు ఇది శరాఘాతమే కానుంది. మీడియా కథనాల ప్రకారం ఆంధప్రదేశ్‌లో టైటానియం ఉత్పత్తులకు అవసరమైన ఖనిజాన్ని వెలికితీసి, అంతర్జాతీయ స్థాయిలో విక్రయించి, కోట్లు మూటగట్టుకునేందుకు ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో సుమారు 64 కోట్ల సొమ్ము బట్వాడా అయినట్లు సమాచారం. ఈ అక్రమ వ్యాపారం అమలుకు తమ దేశ భూభాగాన్ని, తమ దేశంలోని ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించుకున్నారంటూ అమెరికాలోని చికాగో ఫెడరల్‌ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీన్ని అంతర్జాతీయ కుంభకోణంగా, ద్రవ్య అక్రమ చలామణీగా అభివర్ణించింది. గత ఏడాది జూన్‌ 13వ తేదీన ఫెడరల్‌ గ్రాండ్‌ జ్యూరీ సీల్‌ చేసిన ఈ కేసు వివరాలను బుధవారం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *