
ఈవీఎంలలో గందరగోళం
అసోంకు బయలెల్లిన ఈసీఐఎల్ అధికారులు
గువాహటి, ఏప్రిల్ 3 (జనంసాక్షి) :ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లో ఏ పా ర్టీ గుర్తు ఎదురుగా ఉన్న మీటా నొక్కినా అది బీజేపీకే ఓటు వేసినట్టుగా నమో దవుతుంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఢిల్లీ పీఠంపై కుర్చోబెట్ట డమే లక్ష్యంగా ఇలాంటి టాంపరింగ్‌లకు పాల్పడుతున్నారనే ఆరోపణలకు అ సోంలో నిర్వహించిన మాక్ పోలింగ్ ఊతమిచ్చింది. అసోంలోని జోర్హత్ లోక్ సభ నియోజకవర్గంలో గత మంగళవారం ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వ హించారు. ఈ సందర్భంగా వేర్వేరు పార్టీల, అభ్యర్థులకు ఎదురుగా ఉన్న మీటా నొక్కితే బీజేపీ అభ్యర్థికి ఎదురుగా ఉన్న లైటు వెలుగుతూ ఓటు అతని ఖాతాలో పడుతున్నట్లుగా నమోదయింది. జోర్హత్
రిటర్నింగ్ అధికారి, డెప్యూటీ కమిషనర్ విశాల్ వసంత్ సోలంకీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సార్వత్రిక ఎన్నికల కోసం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లను హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) ఆధ్వర్యంలో రూపొందించారు. ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు ఈసీఐఎల్ అధికారులు అసోంకు బయల్దేరారు. జొర్హాత్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి విజయ్ కృష్ణ హెగ్డే దీనిపై స్పందిస్తూ ఈవీఎంలలో లోపం సాంకేతికమైనదైతే పరవాలేదని, అదే కావాలని చేస్తే మాత్రం దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సాంకేతిక పరమైన అంశమైతే వెంటనే అన్ని ఈవీఎంలను పరిశీలించి సరి చేయాలని కోరారు. అసోంలో ఈనెల 7న తొలి విడత పోలింగ్ జరుగనుంది. ఈవీఎంలో తప్పుడు ఓటింగ్ నమోదుపై ఆరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయేంద్ర బుధవారం స్పందిస్తూ తప్పుడు ఓటు నమోదు చేసిన ఈవీఎంను 7న జరుగబోయే పోలింగ్ కోసం వినియోగించడం లేదని తెలిపారు. అన్ని పార్టీల అభ్యర్థుల సమక్షంలో నిర్వహించిన మాక్ పోలింగ్ సదరు ఈవీఎం తప్పుడు ఓటు నమోదు చేస్తున్నట్టుగా గుర్తించామన్నారు. ఇది సాంకేతిక పరమైన తప్పిదమేనని తేల్చిచెప్పారు. ఈవీఎంలో కంట్రోల్ యూనిట్‌తో పాటు అభ్యర్థుల బ్యాలెట్ ఉన్న బ్యాలెటింగ్ యూనిట్ ఉంటాయని దానిని కంట్రోల్ యూనిట్‌తో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. అసోం పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజన్ బొరా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఈవీఎంలను పరీక్షించిన మీదటనే పోలింగ్ కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పక్షాన ఓటు నమోదయ్యేలా ఈవీఎంలను టాంపరింగ్ చేశారని ఆయన ఆరోపించారు. 2011లో జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంలను టాంపరింగ్ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎవరికి ఓటు వేసిన కాంగ్రెస్ పక్షాన నమోదయ్యేలా టాంపరింగ్ చేశారని అప్పట్లో అసోం ఘన పరిషత్ ఆరోపించింది.
ఏ బటన్ నొక్కినా మోడీకే ఓటు




