Tuesday, 3 November 2026

భాజపాది గోబెల్స్‌ ప్రచారం


అవినీతిపై పోరాడుతోంది కాంగ్రెస్సే : రాహుల్‌
బళ్లారి, మార్చి 4 (జనంసాక్షి) :
అవినీతిపై పోరాటం విషయంలో భారతీయ జనతా పార్టీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని ఏఐ సీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీగా బీజేపీ ప్రజలను మభ్యపెడుతోందని ఆయన ఆరోపించారు. ఇది ప్రజలకు అబద్ధాలు చెబు తూ ప్రచారం చేసుకోవడం తప్ప మరోటి కాద న్నారు. ఇలాంటి విషయాలను ప్రజలు నమ్మర న్నారు. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఎన్నిక ల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగిం చారు. బిజెపి అనే మాయను ఓటు అనే ఆయుధంతో అంతం చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అవినీతిపై పోరాడుతున్నట్లు చెప్తోన్న బీజేపీ తమ పార్టీలోని అవినీతి నాయకులకు మాత్రం అక్రమంగా ధనార్జన చేసుకోవడానికి పచ్చజెండా ఊపుతోందని విమర్శించారు. అవినీతి ఆరోపణలుపై వారి ముఖ్యమంత్రి జైలుకు వెళ్లినా, గాలి సోదరులు ప్రకృతి వనరులను కొల్లగొట్టినా ఆ పార్టీ పెద్దలు చూస్తూ ఉన్నారే తప్ప ఏ చర్య తీసుకోలేదన్నారు. యూపీఏ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ దేశానికి చక్కని పరిపాలన అందించిందని ఈ సారి కూడా ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. బిజెపి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రాహుల్‌ సభలకు ప్రజలు విశేషంగా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *