Tuesday, 3 November 2026

అది మేనిఫెస్టో కాదు అల్లావుద్దీన్‌ అద్భుత దీపం

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై పొన్నాల ఎద్దేవా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) :

టీఆర్‌ఎస్‌  మేనిఫెస్టోపై అల్లా వుద్దీన్‌ అద్భుత దీపమని టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య ఎద్దే వా చేశారు. మేనిఫె స్టోతో కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండదని పొన్నాల పేర్కొన్నారు. దీనిని మరోమారు రుజువు చేశారని అన్నారు. శుక్రవారం వైకాపా నేత శ్రీరాంభూపాల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ తెరాసది వాపో, బలుపో ప్రజలే తేలుస్తారన్నారు. టీఆర్‌ఎస్‌కు అరువు తెచ్చుకున్న అభ్యర్థులే ఎక్కువని, తెలంగాణ ద్రోహులు, భూకబ్జాదారులకు కేసీఆర్‌ టికెట్లు ఇచ్చారని పొన్నాల అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ఇదిలావుంటే దళితులకు, మైనారిటీలకు హామీలిచ్చి మాట తప్పింది కేసీఆరేనని కాంగ్రెస్‌ తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహ అన్నారు. మోసగాడి చేతిలో తెలంగాణ పెడితే నట్టేట ముంచుతాడని ఆయన వ్యాఖ్యానించారు. పునర్నిర్మాణం అంటే కూలిన గడీలు నిర్మించడం కాదని, కాంగ్రెస్‌తోనే నవతెలంగాణ సాధ్యమని దామోదర అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రాంతం జాగీర్‌గా మారిందని, కూతురికి నిజామాబాద్‌, కొడుక్కి కరీంనగర్‌, అల్లుడికి మెదక్‌, ఇతర జిల్లాలు కేసీఆర్‌ కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *