
కేంద్ర నిధులు వాడలేదు
కడు పేదరికానికి నవీనే కారణం : సోనియా ఫైర్
భువనేశ్వర్, ఏప్రిల్ 5 (జనంసాక్షి) :ఒడిశాలో కడు పేదరికారినికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. శనివారం ఆమె ఒడిశాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను నవీన్ సర్కారు ఉపయోగించుకోలేదని, ఫలితంగా ఒడిశా ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెట్టివేసిందని ఆమె మండిపడ్డారు. పేదలు, కూలీల వలసలు నివారించేందుకు కేం ద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని కూడా ఒడిశాలో అమలు చేయలే దని, తద్వారా ఇక్కడి ప్రజలను నవీన్ ప్రభుత్వం కడు బీదల్ని చేసిందని ఆవేదన
వ్యక్తం చేశారు. ప్రజల అభ్యున్నతి కోసం కేంద్రం తెచ్చిన ఎన్నో బృహత్ పథకాలు ఒడిశాలో అమలుకు నోచుకోలేదని ఆమె తెలిపారు. నవీన్ పట్నాయక్ తనదైన ముద్ర పేరుతో అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఒడిశా ప్రజల కష్టాలు తీరాలని బీజేడీ సర్కారుకు చరమగీతం పాడాలని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పేదలకు ఆహార భద్రత, విద్యాహక్కు, ఉపాధి హామీ, అవినీతి నిరోధానికి పటిష్టమైన లోక్‌పాల్ చట్టం తీసుకువచ్చామని, మళ్లీ అధికారమిస్తే ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పాటు పడతామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఫలాలు అందరికీ దక్కాలి
ఒడిశా ‘ఉపాధి హామీ’ పొందలేదు




