ఆరుగురు సిట్టింగులు గల్లంతు
వీహెచ్, విజయశాంతి అసెంబ్లీకి
111 మంది అభ్యర్థుల జాబితా వెల్లడించిన అధిష్టానం
గజ్జెల కాంతం, అద్దంకి దయాకర్, దరువు ఎల్లన్నకు మొండిచేయి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 (జనంసాక్షి) :తెలంగాణలోని 111 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. శనివారం రాత్రి ఎంపీ అభ్యర్థులను ప్రటించిన కాంగ్రెస్ అధి ష్టానం ఆ రోజు అర్ధాంతరంగా ఆపేసిన ఎమ్మెల్యేల జాబితాను సోమవారం సాయంత్రం వెల్లడిం చింది. ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి ఇచ్చింది. రాజ్యసభ సభ్యుడు వి. హనుమం తరావు, లోక్‌సభ సభ్యురాలు విజయశాంతిలను శాసనసభకు పంపనుంది. ఎంపీ అభ్యర్థుల జాబితా వెల్లడి సందర్భంగా టీ జేఏసీ నేతలు ఇద్దరు, ఓయూ జేఏసీ నేతలు ఇద్దరికి సీట్లు ఇస్తామ ని చెప్పిన కాంగ్రెస్ గజ్జెల కాంతం, అద్దంకి దయాకర్, దరువు ఎల్లన్నకు మొండిచేయిచ్చి ఒక్క క్రిశాంక్‌కు మాత్రమే సీటు ఇచ్చింది. మొత్తం 119 స్థానాలకు గాను 111 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సబితా ఇంద్రారెడ్డి, ముషీరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే మణెమ్మ, కంటోన్మెం ట్ ఎమ్మెల్యే శంకర్ రావులకు మొండి చేయి చూపారు. అనూహ్యంగా మెదక్ ఎంపీ విజయశాం తికి మెదక్ అసెంబ్లీ సీటును కేటాయించారు. ఇక రాజ్యసభ సభ్యుడు
వి. హనుమంతరావుకు అంబర్ పేట సీటును కేటాయించారు. సుదీర్ఘంగా కసరత్తు చేసిన తరవాత జాబితాకు సోనియా ఆమోదముద్ర వేశారని సమాచారం. కుటుంబంలో ఒకరికి ఒక సీటు అన్న సిద్ధాంతానికి కట్టుబడి టిక్కెట్లు కేటాయించారు. పీసీసీ చీఫ్ పొన్నాలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న జనగామ టిక్కట్‌ను కేటాయించారు. ఆయన కోడలు వైశాలికి టిక్కట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టింది. పీసీసీ మాజీ చీప్ డి.శ్రీనివాస్‌కు కూడా నిజామాబాద్ రూరల్ టిక్కట్ కేటాయించారు. అయితే ఉద్యమకారులకు టిక్కెట్లు కేటాయిస్తారని ప్రచారం జరిగినా మొండిచేయి చూపారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదించిన తరవాతనే ప్రకటించారు. సీపీఐతో పొత్తులో భాగంగా దానికి కేటాయించిన సీట్లను వదిలి మిగతావి ప్రకటించారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 16 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. అయితే వాటిపై అధికారిక సంతకం లేకపోవడంతో ఆగిపోయింది. ఆ జాబితాలో సోమవారం కొంత మార్పులు చేర్పులు చేస్తున్నట్లు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం సోనియాతో దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. మొత్తం 111 అసెంబ్లీ స్థానాల్లో టి. కాంగ్రెస్ పోటీ చేస్తుంది. పొత్తుల్లో భాగంగా 8 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానం సీపీఐకి కేటాయించారు.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా :
జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి జయసుధ, కంటోన్మెంట్ నుంచి క్రిశాంక్, మలక్‌పేట్ నుంచి వీఎన్ రెడ్డి, అంబర్‌పేట్ నుంచి వి. హనుమంతరావు, సనత్‌నగర్ – మర్రి శశిధర్‌రెడ్డి, నాంపల్లి – ఇ. వినోద్, కార్వాన్ – రూప్‌సింగ్, గోషామహల్ – ముఖేశ్‌గౌడ్, చార్మినార్ – వెంకటేశ్, చాంద్రాయణగుట్ట – మైనంపాటి అశ్విన్, యాకుత్‌పురా – సదానంద్ ముదిరాజ్, బహదూర్‌పురా – సయ్యద్ అబ్దుల్ షమీ , పటాన్‌చెరు – నందీశ్వర్‌గౌడ్, దుబ్బాక – చెరుకు ముత్యంరెడ్డి, గజ్వేల్ – నర్సారెడ్డి, మేడ్చల్ – లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి – నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్, ఉప్పల్ లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం – మల్లేశ్, ఎల్బీ నగర్ – సుధీర్‌రెడ్డి, రాజేంద్రనగర్ – కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, శేరిలింగంపల్లి – భిక్షపతియాదవ్, చేవెళ్ల – కె. యాదయ్య, పరిగి – టి. రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్ – గడ్డం ప్రసాద్‌కుమార్, తాండూర్ – నారాయణరావు, ముషీరాబాద్ – డాక్టర్ వినయ్‌కుమార్, ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి ప్రేమ్‌సాగర్ రావు, మంచిర్యాల – అరవిందరెడ్డి, ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు, ఖానాపూర్ – హరినాయక్, ఆదిలాబాద్ భార్గవ్ దేశ్‌పాండే, బోథ్ – అనిల్, నిర్మల్ – ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముథోల్ – విఠల్‌రెడ్డి, ఆర్మూర్ -కేఆర్ సురేశ్‌రెడ్డి, బోధన్ – సుదర్శన్‌రెడ్డి, జుక్కల్ – గంగారాం, బాన్స్‌వాడ – కె. బాలరాజు, ఎల్లారెడ్డి – సురేంద్ర, కామారెడ్డి – షబ్బీర్‌అలీ, నిజామాబాద్ అర్బన్ – మహేశ్, నిజామాబాద్ రూరల్ – డి. శ్రీనివాస్, బాల్కొండ ఈ. అనిల్, కరీంనగర్ జిల్లా కోరుట్ల – కొమిరెడ్డి రాములు, జగిత్యాల – టి. జీవన్‌రెడ్డి, ధర్మపురి – లక్ష్మణ్‌కుమార్, రామగుండం – బాబర్ సలీం పాషా, మంథని – శ్రీధర్‌బాబు, పెద్దపల్లి – టి. భానుప్రసాద్‌రావు, కరీంనగర్ – లక్ష్మీనర్సింహారవు, చొప్పదండి – సుద్దాల దేవయ్య, వేములవాడ – బొమ్మా వెంకన్న, సిరిసిల్ల – కె. రవీందర్‌రావు, మానకొండూర్ – ఆరేపల్లి మోహన్, హుస్నాబాద్ – ఎ. ప్రవీణ్‌రెడ్డి, హుజూరాబాద్ – కేతిరి సుదర్శన్‌రెడ్డి, మెదక్ జిల్లా సిద్దిపేట – టి. శ్రీనివాస్‌గౌడ్. నారాయణఖేడ్ – కృష్ణారెడ్డి, నర్సాపూర్ – సునీతాలక్ష్మారెడ్డి, నారాయణ్‌పేట్ – కృష్ణ, జహీరాబాద్ – గీతారెడ్డి, సంగారెడ్డి – జగ్గారెడ్డి, కొడంగల్ – విఠల్‌రావు, నారాయణ్‌ఖేడ్ – వంశీకృష్ణ, మహబూబ్‌నగర్ – ఒబేదుల్లా కొత్వాల్, జడ్చర్ల – మల్లు రవి, దేవరకద్ర – పవన్‌కుమార్, మక్తల్ – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, వనపర్తి -చిన్నారెడ్డి, గద్వాల్ – డీకే అరుణ, ఆలంపూర్ – సంపత్‌కుమార్, నాగర్‌కర్నూల్ – కె. దామోదర్‌రెడ్డి, అచ్చంపేట్ – వంశీకృష్ణ, కల్వకుర్తి – వంశీచందర్‌రెడ్డి, షాద్‌నగర్ ప్రతాప్‌రెడ్డి, కొల్లాపూర్ – హర్షవర్ధన్‌రెడ్డి, నాగార్జునసాగర్ – కె. జానారెడ్డి, మిర్యాలగూడ – భాస్కర్‌రావు, సూర్యాపేట – దామోదర్‌రెడ్డి, నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి – వెంకటేశ్వర్లు, నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి – నర్సయ్య, ఆలేరు – భిక్షమయ్య, స్టేషన్ ఘన్‌పూర్ – విజయరామారావు, పాలకుర్తి దుగ్యాల శ్రీనివాస్‌రావు, డోర్నకల్ – రెడ్యానాయక్, మహబూబాబాద్-ఎం. కవిత, నర్సంపేట – దొంతి మాధవరెడ్డి, పరకాల – వెంకట్‌రెడ్డి, వరంగల్ వెస్ట్ – స్వర్ణ, వరంగల్ ఈస్ట్ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట – కొండేటి శ్రీధర్, భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు పోదెం – వీరయ్య, ఇల్లెందు – కొర్రం కనుకయ్య, ఖమ్మం – పువ్వాడ అజయ్, పాలేరు – ఆర్. వెంకట్‌రెడ్డి, మధిర – భట్టి విక్రమార్క, సత్తుపల్లి – సంభాని చంద్రశేఖర్, అశ్వారావుపేట – మిత్రసేన, భద్రాచలం – కుంజా సత్యవతి.





