
రామ మందిర్, ఆర్టికల్ 370 తదితర వివాదాస్పద అంశాలకు చోటు
నల్లధనం రప్పిస్తాం.. బ్లాక్ మార్కెట్ నిరోధిస్తాం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 (జనంసాక్షి) :
రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు తదితర వివాదాస్పద అంశాలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. భారతదేశ పునర్ని ర్మాణంతో పాటు సమ్మున్నతంగా దేశాన్ని నిర్మించ డం లక్ష్యంగా ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ఒకే దేశం మ¬న్నత భారత్ నినాదంతో భారతీ య జనతాపార్టీ 52 పేజీల ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సిం గ్, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, సీనియర్‌నేత ఎల్.కె.అద్వానీ, మురళీమోహన్, సుష్మస్వరాజ్ తదితరులు ఎన్నికల ప్రణాళిక
విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో రామమందిర నిర్మాణ సాధ్యాసాధ్యాలు, మైనార్టీలకు అవకాశాలు తదితర అంశాలను పొందుపర్చింది. ఒక దేశం మ¬న్నత భారత్ బిజెపి ఉద్దేశ్యమన్నారు. అవినీతి నిర్మూలన, నల్లధనంపై మేనిఫెస్టోలో ప్రాధాన్యత కల్పించారు. భారతీయ జనతా పార్టీ సోమవారం ఉదయం ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. 17 మంది సభ్యులు దీనిని రూపొందించారు. పార్టీ సీనియర్ నేత మురళీమనోహర్‌జోషీ నేతృత్వంలో ఈ ప్రణాళికను రచించారు. మనోహర్ జోషీ ప్రణాళికను చదివి వినిపించారు. ప్రణాళిక రూపకల్పణకు లక్ష సూచనలు అందాయని జోషీ చెప్పారు. రైతులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తల నుంచి సూచనలు అందినట్లు చెప్పారు. ఉపాధి కల్పనకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత కల్పించారు. పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లక్ష్యంగా ముందుకు వెళతామన్నారు. పోలీసు, న్యాయ, పరిపాలన విభాగాల్లో సంస్కరణలు తీసుకుని వచ్చి, ప్రతి రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రణాళిక రూపొందించి, బ్రాండ్ ఇండియాను రూపొందిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి తాగునీరు, ప్రతి రైతుకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. వెనుకబడిన రాష్ట్రాలు, అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీల సాధికారతకు కృషి చేస్తామన్నారు. ప్రతి గ్రామాన్ని ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తామన్నారు. నల్లబజారు నివారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, తీవ్రవాద నిరోధానికి ప్రత్యేక యంత్రాంగం, పన్నుల విధానంలో సంస్కరణలు ఇందులో పొందుపరిచారు. పర్యాటక అభివృద్ధికి కొత్త సర్క్యూట్ల ఏర్పాటుతో పాటు, రామ మందిరం నిర్మాణానికి సాధ్యాసాధ్యాల పరిశీలన చేస్తామన్నారు. విదేశాల్లోని నల్లధనం వెనక్కి తెప్పించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మల్టీ బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకం అన్నారు. మైనార్టీలకు సమాన అవకాశాలు, మదర్సాల ఆధునీకరణకు హామీ ఇచ్చారు. హిమాలయాల అభివృద్ధిని ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలతోనే భారత్ పురోగతిసాధ్యమని ప్రకటించారు. సమానత్వ సాధనకు ఉమ్మడి పౌర స్మృతి తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. ధరల పెరుగుదల, నల్లధనం నియంత్రణ, ఉద్యోగాల కల్పన ప్రధానాంశాలుగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించబడింది. యూపీఏ ప్రభుత్వంలో దేశం అధోగతి పాలైందని విమర్శించారు. ‘ఒక దేశం మ¬్నత భారత్’ బీజేపీ నినాదమని జోషి పేర్కొన్నారు. ఇక ఆర్థికంగా భారత్‌ను బలోపేతం చేసేందుకు బ్యాంకుల నిరర్థక ఆస్తుల తగ్గింపునకు కృషి చేస్తామన్నారు. ఉత్పాదకరంగంలో బ్రాండ్ ఇండియా సృష్టించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. 50 కొత్త టూరిస్టు సర్క్యూట్ల ఏర్పాటుతో పాటు వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు భాజపా ఎన్నికల ప్రణాళిక అద్దం పడుతోందని ఆపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన సందర్భంగా మోడీ మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మోడీ స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలకు భాజపా ఎన్నికల ప్రణాళిక అద్దం పడుతోందన్నారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉండాలని, కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పార్టీ సీనియర్‌నేత మురళీమనోహర్ జోషి మాట్లాడుతూ భాజపా ఎన్నికల ప్రణాళిక తయారీకి 17 మంది సభ్యులతో కూడిన కమిటీ పనిచేసిందని వివరించారు. ప్రణాళిక రూపకల్పనకు రైతులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తల నుంచి లక్షల సూచనలు అందినట్లు చెప్పారు.
భాజపా మేనిఫెస్టో విడుదల




