
తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ
జమల్‌పూర్, ఏప్రిల్ 7 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తమ పార్టీ లోక్‌సభలో మూ డో అతిపెద్ద పార్టీగా అవతరి స్తుందని తృణమూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమ తా బెనర్జీ అన్నారు. సోమవా రం పశ్చిమబెంగాల్‌లోని జ మల్‌పూర్, బాలాగఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయమని ఆమె చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక
భూమిక పోషిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఎంలు అప్రకటిత సంధి దశలోకి వచ్చాయని ఆ పార్టీలకు ఓటేయద్దని బెంగాల్ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు తమ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మాదే మూడో అతిపెద్ద పార్టీ




