
ఇది అక్రమ సంబంధం : హరీశ్ ఫైర్
హైదరాబాద్, ఏప్రిల్ 7 (జనంసాక్షి) :సమైక్యవాది చంద్రబాబుతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడం ముమ్మాటికీ అక్రమ సంబంధమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నా రు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన చంద్రబాబుతో కలసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న బీజేపీ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. ఇది పరస్పర వైరుధ్యం ఉన్న విషయమన్నారు. టీడీపీ, బీజేపీల పొత్తు అనైతికమని హరీశ్‌రావు విమర్శించారు. తెలుగుదేశం, బీజేపీల పొత్తుపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలను బీజేపీ తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. దేశం కోసం బీజేపీతో పొత్తు అని చంద్రబాబు అనడం విడ్డూరమన్నారు. బీజేపీతో పొత్తు టిడిపికి అవసరమా లేక దేశానికి అవసరమా చెప్పాలన్నారు. బిజెపితో పొత్తు చారిత్రక తప్పిదమన్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో వెళ్లడం సరికాదన్నారు. చంద్రబాబు వాడుకొని వదిలేసే రకమన్నారు. బిజెపి, టిడిపి పొత్తు ఆత్మహత్యా సదృశ్యమే అన్నారు. ఎన్నోసార్లు ఇచ్చిన మాటను తప్పిన బాబు మాట ఎవరు నమ్ముతారన్నారు. బాబులా మాట మార్చే వారు ప్రపంచంలోనే లేరన్నారు. తెలంగాణను అడ్డుకున్న టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకోవడంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బాబు డిమాండ్లకు బిజెపి ఆమోదించిందా చెప్పాలన్నారు. అదే నిజమైతే తెలంగాణకు బిజెపి కూడా మోసం చేసినట్లే అవుతుందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన కిషన్‌రెడ్డిని, అడ్డుకున్న చంద్రబాబును ఒకే వేదిక పైన ఎలా చూడగల్గుతామన్నారు. టిడిపి తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. మోడీని అడ్డుపెట్టుకొని చంద్రబాబు గెలవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే 18 శాతం ఓట్లు వచ్చాయని, టిడిపితో కలిశాక 3 శాతం మాత్రమే వచ్చాయన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు స్వయం ప్రకాశం లేని చంద్రుడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేశారా చెప్పాలన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కేబినెట్‌ను అలీబాబా నలభై దొంగలు అని ఇప్పుడు వారిని ఎలా చేర్చుకుంటారన్నారు. బాబు పక్కా అవకాశవాది అన్నారు. మాట తప్పడంలో చంద్రబాబును మించిన నేత లేడన్నారు. మామ ఎన్టీఆర్ దగ్గరకు తీస్తే ఆయనను వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్నారని, ఆ తర్వాత వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారని, వారిని పక్కన పెట్టి 1999లో బిజెపితో కలిసి వెళ్లారని, అనంతరం బిజెపితో పొత్తు చారిత్రక తప్పిదమని చెప్పి తెరాస, లెఫ్ట్ పార్టీలతో కలిశారని, ఇప్పుడు మళ్లీ బిజెపితో వెళ్తున్నారని, ఆయన వాడుకొని వదిలేసే రకమన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా బాబును కాపాడటం భూమండలంలో ఎవరికి సాధ్యం కాదన్నారు. గోద్రా ఘటన తర్వాత మోడీని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు భాజపాతో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబులాగ మాటలు మార్చేవారు ప్రపంచంలో ఎవరూ ఉండరని విమరించారు. మామ దగ్గరికి తీస్తే వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిండని ఎద్దేవా చేశారు. ఆలీబాబా 40 దొంగలని వైఎస్ కేబినెట్‌ను విమర్శించిన చంద్రబాబు ఆ కేబినెట్లో పనిచేసిన వారినే పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిపారు. కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకుని వారిని వాడుకుని వదిలేశారని అన్నారు. కమ్యూనిస్టుల సిద్దంఆతంఆలు కాలం చెల్లాయన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. టిడిపి అవసరం భారతదేశానికా తెలుగుదేశానికా అని ప్రశ్నించారు. టిడిపి అవసరం దేశానికి అనడంపై ఆయన మండిపడ్డారు. మద్యపానం నిషేధాన్ని ఎత్తివేసి బెల్ట్‌షాపులను బార్లా తెరిచిన నేత చంద్రబాబు కాదా అని అడిగారు. భారత దేశంలో సంక్షోభం లేదు తెలుగుదేశం సంక్షోభంలో ఉందని చంద్రబాబు చెప్పుకోవాలని తెలపారు. తెలుగుదేశం పార్టీని కాపాడటం ఎవరి వల్ల కాదన్నారు. బీజేపీ – టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్యా సదృశ్యంలాగ ఉందన్నారు. చంద్రబాబును స్వయంప్రకాశం లేని చంద్రుడిగా హరీశ్ అభివర్ణించారు. చంద్రబాబు పొత్తులు లేకుండా ఏనాడైనా పొత్తు లేకుండా పోటీ చేసిండా, చంద్రబాబు ఒంటరిగా ఎప్పుడైనా ప్రజల ముందుకు పోయిండా అని ప్రశ్నించారు. వామపక్ష పార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేసిండని తెలిపారు. చంద్రబాబు సీమాంధ్ర సీఎం అయితే బీజేపీతో కలిసి తెలంగాణకు గండికొడ్తడని చెప్పారు. మోడీని అడ్డుపెట్టుకుని చంద్రబాబు లాభపడాలని చూస్తున్నాడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలను బీజేపీ తాకట్టు పెడుతున్నదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చంద్రబాబు ప్రకాశం లేని చంద్రునిలా మారారని ఆయన విమర్శించారు. ఓటమి భయంతోనే బీజేపీతో టీడీపీ అనైతిక పొత్తు పెట్టుకుందని హరీష్ రావు అన్నారు. ఈ రెండు పార్టీల పొత్తును ప్రజలు ఆమోదించటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏ ప్రాతిపదికన టీడీపీతో పెట్టుకున్నారో బీజేపీ స్పష్టం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
సమైక్యవాది బాబుతో భాజపా పొత్తా?




