
ఆచరణ కాని హామీలు
సాధ్యం కాని వాగ్దానాలు
అమరవీరుల స్తూపం వద్ద
అభ్యర్థులతో పొన్నాల ప్రమాణం
హైదరాబాద్, ఏప్రిల్ 8 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర్‌రావు మాయట మరాఠి అని, ఆచరణ సాధ్యం కాని హామీలు, వాగ్దానాలతో ప్రజలను మభ్య పెడుతున్నాడని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసే అభ్య ర్థులతో మంగళవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద పొన్నాల ప్రమాణం చేయించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అంకిత మవుదామంటూ పొన్నాల వారితో ప్రమాణం చేయించారు. అమరవీ రుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లా డుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను సోనియాగాంధీ నిలుపు కున్నారన్నారు. అందుకే తెలంగాణ ప్రజల కల సాకారమైందని ఆయన అన్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తామే సాధించామంటూ కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. సీమాంధ్రలో పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసినా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునేందుకే సోనియా అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం సాధించి సోనియాగాంధీకి బహుమానంగా ఇద్దామని ఆయన అన్నారు. గెలుపు, సామాజిక కోణంలోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆయన అన్నారు. అమర వీరుల కుటుంబాలకు టికెట్లు కేటాయించే అంశంపై జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటాయని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన తెలిపారు. సన్నాసుల భాష గురించే మాట్లాడే కేసీఆరే పెద్ద సన్నాసి పొన్నాల అన్నారు. ఇచ్చిన మాటను నిలుపుకోలేని కేసీఆర్ నైజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు గట్టి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
కెసీఆర్ మాయల మరాఠి




