
దాడి చేసిన ఆటోవాలాతో కేజ్రీవాల్ భేటీ
క్షమించమని కోరిన డ్రైవర్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 (జనంసాక్షి) :
త నను చెంపదెబ్బ కొట్టిన ఆటో డ్రైవర్ లాలితో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం భేటీ అయ్యారు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో ఆరా తీ సారు. తనపై ఏదైనా కోపం ఉందా అని అడిగారు. మం గళవారం సుల్తాన్‌పురి ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్‌కు పూలమాల వేయడానికి జీపు పైకి వచ్చిన ఆటోడ్రైవర్ ఆ యనకు మాల వేసి, ఆ వెంటనే
ఎడమ చెంపపై గట్టిగా కొట్టాడు. వెంటనే ఆప్ కార్యకర్తలు లాలిని చితకబాది ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం కేజ్రీవాల్ లాలిని కలిశారు. కేజ్రీవాల్‌తో ఆటోడ్రైవర్ తాను చాలా పెద్ద తప్పు చేశానని, క్షమించమని కోరుకున్నాడు. నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని ఆటో డ్రైవర్ లాలీ అన్నారు. ‘నేను పెద్ద తప్పే చేశాను. నా జీవితంలో ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయలేదు. నా దృష్టిలో కేజ్రీవాల్ దేవుడు అని’ లాలూ అన్నారు. కేజ్రీవాల్‌ను క్షమించాలంటూ కాళ్లకు వంగి దండం పెట్టడానికి వచ్చిన లాలీని మనీష్ సిసోడియా వారించారు. గత కొద్దికాలంగా కేజ్రీవాల్‌ను కలిసేందుకు ప్రయత్నించాను. ఆయనను కలువడానికి జనతా దర్బార్‌కు వెళ్లాను అని మీడియాకు తెలిపారు. గత వారం రోజుల్లో కేజ్రీవాల్ పై దాడి జరగడం ఇది రెండవసారి. లాలి ఆప్ మద్దతుదారు అని, అలా ఎందుకు చేశాడో అర్థంకావడం లేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. తనపై దాడికి దిగిన వారిపై దాడి చేయవద్దని కేజ్రీవాల్ తన అనుచరులకు సూచించారు. అలా చేస్తే వారికి, మనకు తేడా ఉండదని తెలిపారు. తర్వాత కేజ్రీవాల్ గత వారం దక్షిణపురి ప్రచారంలో దాడి చేసిన అబ్దుల్ వాహిద్‌ను కలిసి మాట్లాడారు. ఈ దాడులకు తన రాజకీయ ప్రత్యర్థులే కారణమని ఆప్ నేతలు పేర్కొంటున్నారు.




