Tuesday, 3 November 2026

ఆలె నరేంద్ర ఇకలేరు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) :

కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నాయకుడు ఆలె నరేంద్ర (68) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. న రేంద్ర మెదక్‌ నియోజకవర్గం నుంచి 13, 14వ లోక్‌ సభలకు ప్రాతినిధ్యం వహించారు. టీఆర్‌ఎస్‌ తరఫున ఆయన గెలిచి కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర బిజెపిలో కీలకపాత్ర పోషించిన నరేంద్ర 1983- 94 మధ్య ఎమ్మెల్యేగా

వున్నారు. తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రసమితిలో విలీనం చేశారు. 1999లో మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అనంతరం యూపీఏ-1 ప్రభుత్వంలో గ్రావిూణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఇవ్వనందుకు నిరసనగా ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టారు. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆలే నరేంద్ర ఆ పార్టీని వీడి స్వంత పార్టీ పెట్టారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆహ్వానం మేరకు తెలంగాణ సాధన సమితిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్‌ తరపున మెదక్‌ ఎంపీగా ఆలే నరేంద్ర గెలిచారు. ఆయనపై పాస్‌పోర్టు కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు రావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అనంతరం నరేంద్ర మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. తరవాత దానిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసి మెదక్‌ నుంచి ఎంపీగా గెలిచారు. తరవాత కెసిఆర్‌తో విభేదా కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తెరాస నుంచి బయటకు వచ్చి కొంతకాలం కాంగ్రెస్‌తో సాన్నిహిత్యంగా వున్నారు. చివరకు మళ్లీ తన మాతృసంస్థ బిజెపిలో చేరారు. నరేంద్ర బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. నరేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టలర్లు తెలిపారు. గతకొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడతుతున్నారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన మృతికి బీజేపీ నేతలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, బద్దం బాల్‌ రెడ్డి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *