Tuesday, 3 November 2026

మోడీకి లగ్గమైంది

ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన నరేంద్రుడు
ప్రమాణపత్రంలో భార్య యశోదగా వెల్లడి
40 ఏళ్ల తర్వాత నిజాలు
బయటపెట్టిన గుజరాత్‌ సీఎం
వడోదర, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) :
తనకు పెళ్లైందని, తాను వివాహితుడినని భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ తెలిపారు. లోక్‌స భకు నామినేషన్‌ వేసిన సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫి డవిట్‌లో తన భార్య పేరు యశోదబెన్‌గా వెల్లడించారు. ఇన్నాళ్లు భార్య కాలన్ని పూర్తి చేయకుండా గీత పెట్టడం ద్వారా దాటవేస్తూ వచ్చిన మోడీ 40 ఏళ్ల త ర్వాత తన వైవాహిక స్థితిపై ప్రతిపక్షాల ఆరోపణలు వెళ్లువెత్తడంతో స్పందిచారు. అయితే తన భార్యకు చెందిన ఆస్తుల కాలమ్‌లో మాత్రం ఆ వివరాలు తనకు తెయవని పేర్కొన్నారు. బుధవారం మోడీ నామినేషన్‌ దాఖలు చేయగా వడోదర రిటర్నింగ్‌ అధి కారి ఆ వివ రాలను అర్ధరాత్రి దాటిన తర్వాత కలెక్టరేట్‌ డిస్‌ప్లే బోర్డులో ప్రదర్శనకు ఉంచారు. తనకు రూ.1.51 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు మోడీ వెల్లడించారు. అయి తే ఒక్క వాహనం కూడా లేదని పేర్కొన్నారు. చరాస్తు లుగా బ్యాంకుల్లో ఉన్న నగదు, ఫిక్సుడ్‌ డిపాజిట్లు కలిపి రూ.51,57,586, నగదు 29,700, రూ.1.35 లక్షల విలువైన నాలుగు ఉంగరాలు ఉన్నట్లు ప్రకటించారు. గాంధీ నగర్‌లో కోటి రూపాయల విలువైన ఇల్లు ఉన్నట్లు వెల్లడించారు. అది తప్ప తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవ ని, ఎక్కడా భూములు, స్థలాలు లేవని ప్రకటించారు. 20 12-13 సంవత్సర ఐటీ రిటర్నుల ప్రకారం మోడీ ఆస్తు ల విలువ రూ.4,54,094. 2012 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన ఆదాయం రూ.1.33 కోట్లు. తన వార్షిక ఆదాయంగా రూ.1,50,630 లుగా చూపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *