
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 (జనంసాక్షి) :
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.ఎం. లోధా నియమితులయ్యారు. ఆయన ఈనెల 27న బాధ్య తలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఈనెల 26న పదవీ విరమణ చేస్తారు. దేశంలోనే అత్యున్నతమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులైన జస్టిస్ లోధా రాజస్థాన్‌కు చెంది న వారు. ఆయన 1994లో
రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే ఏడాది బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా 13 ఏళ్లపాటు సేవలందించిన ఆయన 2008లో పదోన్నతిపై పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లోనే సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడుల నియంత్రణకు రిటైల్ మార్కెట్‌లో యాసిడ్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించారు లోధా. అదేవిధంగా యాసిడ్ బాధితులకు ప్రభుత్వం వెంటనే రూ. 2లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. లోధా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈఏడాది సెప్టెంబర్ 27వరకు కొనసాగుతారు.
సుప్రీంకోర్టు సీజేగా ఆర్‌ఎం లోధా




