Tuesday, 3 November 2026

తెలంగాణ మాదే


16న కరీంనగర్‌లో సోనియా సభ
అమ్మ రాకతో సీన్‌ మారుతుంది
శంకరమ్మను ఓడించేందుకే హుజూర్‌నగర్‌
మైనార్టీ రిజర్వేషన్లు కేసీఆర్‌ ఇవ్వడు
ఆయనదంతా
బూటకం : పొన్నాల
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) :
తెలంగాణలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఈనెల 16న కరీంనగర్‌లో నిర్వహిం చే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పార్టీ అది óనేత్రి సోనియాగాంధీ పాల్గొంటారని ఆయన తెలి పారు. ఆమె రాకతో తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రమే మారిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశా రు. ఒప్పందం ప్రకారమే సీపీఐకి సీట్లు కేటా యించామని పొన్నాల అన్నారు. గురువారం ఆ యన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చర్చల్లో వచ్చిన అంశాల మేరకు కుదిరిన ఒప్పం దాల మేరకు టిక్కెట్ల కేటాయింపు జరిగిం దన్నారు. అధిష్టానం సూచనల మేరకే మల్‌రెడ్డి రంగారెడ్డికి షరతులతో
బీఫాం ఇచ్చామన్నారు. తాము ఎక్కడా ఒప్పందాలను కాలరాయలేదన్నారు. సీపీఐకి కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్‌ రెబల్స్‌ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని తెలిపారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత స్థానం కలిపించామని పొన్నాల తెలిపారు. టీఆర్‌ఎస్‌పై ఆయన మరోమారు మండిపడ్డారు. హేయమైన చరిత్ర కలిగిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని పొన్నాల ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినవారికే టికెట్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. అమర వీరులకు టికెట్లు ఇవ్వాలని అంశం తన దృష్టికి రాలేదని పొన్నాల తెలిపారు. బలమైన కాంగ్రెస్‌ అభ్యర్థి ఉన్నచోట శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను నిలబెట్టారని ఆయన ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో శంకరమ్మను నిలబెట్టడంఇదే కోవలోకి వస్తుందన్నారు. అక్కడ బలమైన కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌కు శంకరమ్మపై ఉన్న కృత్రిమ ప్రేమకు ఇది నిదర్శనమని పొన్నాల వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా లేని పార్టీలు అధికారంలోకి వస్తామని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఇదిలావుంటే ఆయన జైరాం రమేశ్‌తో సుదీర్ఘ మంతనాలు సాగించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో కేంద్రమంత్రి జైరాం రమేష్‌తో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కొప్పుల రాజు భేటీ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోలోని అంశాలు, తదితర విషయాలపై జైరాం రమేష్‌తో నేతలు చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ గెలుస్తుంది కాబట్టే సీట్ల కోసం పోటీ నెలకొందని ఆయన చెప్పారు. ఇప్పుడు సీట్లు రాని వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది తామేనని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు బీసీలను మోసం చేశాయని, 20 శాతం సీట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. రాజకీయ లబ్ధి పొందాలనుకునే పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని పొన్నాల అన్నారు. అభ్యర్థుల ఎంపికలో మహిళలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రావణుడికి రంగు మారిస్తే రాముడవుతాడా అని పొన్నాల ప్రశ్నించారు. అరచేతిలో స్వర్గం చూపించేవారిని ప్రజలు నమ్మరన్నారు. ఈ నెల 16న కరీంనగర్‌లో కాంగ్రెస్‌ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బహిరంగ సభకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హాజరవుతారని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే.. అధికారంలోకి రాబోయేది కూడా ఆ పార్టీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు పొన్నాల లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. ఆమె కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్‌ కొత్తగా తెలంగాణ కోసం చేసిందంతా తామే అని చెప్పుకొంటున్నారని విమర్శించారు. 2009లో కరీంనగర్‌ సభలో ఇచ్చిన మాట ప్రకారమే సోనియా తెలంగాణ ఇచ్చారని చెప్పారు. 30 ఏళ్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా తెలుగుదేశంలో మంత్రిగా ఉండి ఏనాడైనా కేసీఆర్‌ తన నియోజకవర్గంలో ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి ఉద్యమం గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్‌తో కలిసినప్పుడు తెరాసకు 42 సీట్లిస్తే 26 మాత్రమే గెలిచారని, 2009లో తెదేపా, వామపక్షాలతో కలిసినప్పుడు 52 సీట్లిస్తే 10 మాత్రమే గెలిచారని.. అలాంటి పార్టీ ఇప్పుడు అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని కేసీఆర్‌ చెప్పే గాలిమాటల్ని ఎవరూ నమ్మొద్దని అన్నారు. ఆయన అందరి చెవుల్లో పూలు పెడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌, చంద్రబాబుకూ గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే వ్యవసాయానికి పగటిపూట ఏడుగంటల కరెంటు ఇస్తామని, సౌరశక్తి ద్వారా అదనపు కరెంటు ఉత్పత్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్‌ ఇస్తున్న హామీలు ఆచరణ సాధ్యం కాదని పీసీసీ తెలంగాణ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎలా సాధ్యమని అన్నారు. ఇది ఓ రకంగా మైనార్టీలను మభ్య పెట్టడమే అన్నారు. మైనారిటీల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల రిజర్వేషన్లు పెంచేందుకు ఓ కమిటీని వేస్తామని లక్ష్మయ్య హామీ ఇచ్చారు. గురువారం నాంపల్లి మదీనా ఎడ్యుకేషన్‌ సొసైటీలో ఉలేమాన్‌ పెద్దలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంగా మైనారిటీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముస్లిం పెద్దలు కోరారని చెప్పారు. మైనారిటీలకు అమలు అవుతున్న 4 శాతం రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని, మైనారిటి సబ్‌ ప్లాన్‌ను అమలు చేయడానికి బిల్లును తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామని హావిూ ఇచ్చినట్లు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందని, ముస్లింలు కాంగ్రెస్‌కు సహకరించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న షబ్బీర్‌ ఆలీ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌పై మండిపడ్డారు. ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తేనే సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిందని, న్యాయస్థానం ఆదేశంతో రిజర్వేషన్లు 4 శాతానికి తగ్గించామని ఆయన చెప్పారు. మరి మైనార్టీలకు కేసీఆర్‌ 12 శాతం రిజర్వేషన్లు ఏ లెక్కన ఇస్తారని షబ్బీర్‌ ఆలీ ప్రశ్నించారు. కేసీఆర్‌ హామీల అమలు అసాధ్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *