
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 (జనంసాక్షి) :ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి తాను రా జీనామా చేయడం తప్పేనని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర వింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. అవును… తప్పు చేశాను. రాజీనామా చే యడం తప్పే అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 49 రోజులకే రాజీనామా చేయడాన్ని ప్రజలు హర్షించడం లేదని కేజరీవాల్ అం గీకరించారు. రాజీనామా చేయడానికి సైద్ధాంతిక కారణాలున్నా, రాజీనామా టైమింగ్ మాత్రం పొరబాటేనని ఆయన అంటున్నారు. ప్రజలకు మరింత వి వరణను ఇచ్చి, సభలు పెట్టి, మా అభిప్రాయాన్ని చెప్పి, ఆ తరువాత రాజీ నామా చేసి ఉంటే బాగుండేదేమోనని
అభిప్రాయపడ్డారు. అలా చేయకుండా నేరుగా రాజీనామా చేయడం వల్ల ప్రజలకు మా పట్ల అనుమానాలు పెరిగాయి. వారు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 49 రోజులకే రాజీనామా చేయడం తో ఆప్ మద్దతుదారుల్లో తీవ్ర నిరాశ, ఆగ్రహాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో ఉండగా కేజ్రీవాల్ పై రాళ్లు విసరడం, చెంప దెబ్బ కొట్టడం వంటి సంఘటనలు జరిగాయి. కొద్ది రోజుల క్రితం లాలీ అనే ఆటోరిక్షా డ్రైవర్ సుల్తాన్ పూర్ ప్రాంతంలో కేజ్రీవాల్‌కి మెడలో పూల దండలు వేసి మరీ లాగి లెంపకాయ కొట్టాడు. దీంతో ఆయన గతంలో చేసిన తప్పుకు ఇప్పుడు వివరణ ఇచ్చుకుంటున్నారు.
నేను రాజీనామా చేయకుంటే బాగుండు : కేజ్రీవాల్




