
కాంగ్రెస్, సీపీఐ సంకీర్ణంతో సర్కారు ఏర్పాటు : నారాయణ
హైదరాబాద్, ఏప్రిల్ 11 (జనంసాక్షి) :
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తిరు గుబాటు నామినేషన్లు వేసిన వారం తా తమ నామినేషన్లను ఉపసంహ రించుకొని పార్టీలోకి తిరిగి రావా లంటూ టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మ య్య కోరారు. సీపీఐతో కాంగ్రెస్ పొత్తులు ఫలించా యని టీపీసీసీ అధ్య క్షుడు పొన్నాల లక్ష్మ య్య అన్నారు. సీపీ ఐతో కలయిక వల్ల ఇరు పక్షాలకూ లా భం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ నా మినేషన్ వేసిన చోట కాంగ్రెస్ రెబల్స్ నా మినేషన్ ఉపసంహ రించుకోవాలని అధి ష్టానం ఆదేశిం చిందని తెలిపారు. ఉద్యమంలో భాగమైన వారందరితో ఎన్నికల్లో కలిసి వెళ్లాలనుకున్నామ ని.. మహే శ్వరంలో మల్‌రెడ్డి నామి నేషన్ ఉపసంహరింపజేస్తామని హా మీనిచ్చారు. అలాగే కొన్ని పరిస్తితు ల్లో పొత్తులు
అనివార్యం అయ్యాయని పొన్నాల అన్నారు. సిపిఐతో మాత్రమే పొత్తు కుదురిందన్నారు. అయితే కొన్నిచోట్ల కండిషనల్ బి పారం ఇచ్చిమని అలాంటి చోట్ల విరమించుకోవాలన్నారు. ఈ విషయమై ఉదయం సిపిఐ కార్యదర్శి నారాయణ పొన్నాలతో భేటీ అయ్యారు. రెబల్స్ రంగంలో ఉండడంపై చర్చించారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్, సిపిఐ పొత్తుల వల్ల మంచయి ఫలితాలు ఉండేవని నారాయణ అన్నారు. అయితే కెసిఆర్ ఎందునో రూటు మార్చారన్నారు. కాంగ్రెస్‌వాళ్లు సీట్లు కోరుకోవడం సహజమే.. కానీ కాంగ్రెస్‌కు ప్రభుత్వం వస్తుంది..మాకు సీట్లు వస్తాయని సీపీఐ నేత నారాయణ అన్నారు. తాత్కాలికావేశాలు వద్దని కాంగ్రెస్ అసంతృప్తులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. సీపీఐ 10 సీట్లు అడిగితే 7 ఇచ్చారని.. అంసతృప్తి ఉన్నా సంతప్తితో ఎన్నికలకు వెళ్లక తప్పదు. పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేసి కాంగ్రెస్ కు దూరం కావొద్దని సూచించారు. రేపు ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. మహేశ్వరంలో బీ-ఫాం ఎలా ఇచ్చారో మాకు తెలియదని.. మల్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించు కోవాల్సిందేనని తెలిపారు. కాంగ్రెస్ తో అధికారం పంచుకునే అంశంపై మా కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తెలంగాణ ప్రకటించాక సోనియాను కలిసిన తరవాత కూడా కెసిఆర్ కాంగ్రెస్‌ను తిట్టడం ఆత్మవంచనే అవుతుందన్నారు.
తిరుగుబాట్లు తిరిగి రావాలి : పొన్నాల




