
తెలంగాణకు భారీ జాతీయ విద్యుత్ ప్రాజెక్టు : జైరామ్ రమేశ్
నల్గొండ, ఏప్రిల్ 11 (జనంసాక్షి) :తెలంగాణ ప్రాంతంపై కేంద్ర మంత్రి జైరా మ్ రమేశ్ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్ప త్తి కోసం రూ. 20 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్టు నిర్మించనున్న ట్లు తెలిపారు. శుక్రవారం నల్గొండ పర్యటనకు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ… హైదరాబాద్ నుంచి వచ్చే రూ. 25 – 30 కోట్ల ఆదాయాన్ని తెలంగాణ ప్రాంత అభివృద్దికే కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే సింగరేణి బొగ్గు గనుల్లో 51 శాతాన్ని తెలంగాణకు, 49 శాతం కేంద్ర ప్రభుత్వానికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్దికి ఇక్కడ
ప్రాజెక్టులు, పరిశ్రముల స్థాపిస్తామన్నారు. తెలంగాణలో దేశంలోని అతి పెద్ద విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు కల్పిస్తామని జైరాం పేర్కొన్నారు. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని జైరాం రమేశ్ తెలిపారు. ఆయా పరిశ్రమలకు పన్ను మినహాయింపూ కల్పిస్తామని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంత ప్రజల అభిమతం మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణను ఏర్పాటు చేశారని చెప్పారు. సామాజిక తెలంగాణ సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ¬దా కల్పిస్తామని, 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. తెలంగాణలోని అనువైన ప్రాంతంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ సహా పది జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతానికి చెందిన 40 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు అన్నీ పార్టీల నాయకులను కలిసి కోరారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఈ ప్రాంత ఎంపీలు శాంతియుతంగా, అహింసా పద్ధతిలో కార్యక్రమాలు చేపట్టి రాష్టాన్న్రి సాధించుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులేనని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. తెలంగాణ కోసం తమ ఎంపీలే పోరాడారని, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఎక్కడా కనిపించలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ఆయన తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని జైరామ్ రమేశ్ అన్నారు.
కరెంటు కష్టాలు తీరుస్తాం




