
మధ్య పోటీ : సోనియా
భువనేశ్వర్, ఏప్రిల్ 11 (జనంసాక్షి) :ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు మతతత్వానికి, లౌకికవాదానికి మధ్య పోటీ అని కాంగ్రెస్ పార్టీ అధ్య క్షురాలు సోనియాగాంధీ అన్నారు. శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన ఎన్నిక ల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. మతతత్వ శక్తులు దేశాన్ని నిలువునా విభజించాలని కుట్రలు పన్నుతున్నాయని, అందుకోసం అధికారమివ్వమంటూ మీ ముందుకు వస్తున్నాయని ప్రజలను హెచ్చరించారు. అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే స్థానికంగా అధికారంలో ఉన్న బీజేడీ ప్రభుత్వం ప్రజలను విస్మరించిందని మండిపడ్డారు. నవీన్ పట్నా యక్ తన సొంత ఇమేజీ పెంచుకోవడం కోసం ప్రజల హక్కులను బలిపె ట్టారని ఆరోపించారు. ప్రజలకు కనీసం హక్కులు అందకుండా నవీన్ కుట్ర పన్నారని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో మతం పేరుతో ప్రజల వద్దకు వచ్చే వారిని తిరస్కరించాలని కోరారు. అలాంటి వారిని అందలం ఎక్కిస్తే దేశం అధోగతి పాలవుతుందని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడం అధికా రాన్ని దక్కించుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, హిందుత్వ అతివాద శక్తులు వారిని ప్రేరేపిస్తున్నారని తెలిపారు.
ఈ ఎన్నికలు మతతత్వానికి, లౌకికవాదానికి




