Tuesday, 3 November 2026

బాలకృష్ణ సీటుపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు

(జ‌నంసాక్షి):  టీడీపీ సీమాంధ్ర అభ్యర్థుల రెండో లిస్టును ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారు..అయితే ఇప్పటికే సీమాంద్రలో దాదాపు సగానికిపైగా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బాబు.. బావమరిది బాలకృష్ణ సీటుపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు..మరోవైపు యువరత్న హిందూపురం నుంచి పోటీ చేస్తాడంటూ వార్తలు వస్తున్నా..జాబితాల్లో మాత్రం బాలయ్య పేరు కనబడకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ఇక బాలయ్య మాత్రం బావ నిర్ణయమే..ఈ బావమరిది నిర్ణయమంటున్నారు.. కాకాపోతే సీటు విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరినట్లు సమాచారం..ఇదిలాఉంటే ఇప్పటివరకూ సీమాంధ్రలో విడుదల చేసిన రెండు లిస్టుల్లో హిందూపురం సీటుకు అభ్యర్థిని మాత్రం బాబు ప్రకటించలేదు..దీంతో హిందూపురం నుంచి బాలయ్య పోటీ చేస్తాడన్న వార్తలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే అధినేత నిర్ణయం వెలువడాల్సివుంది. అయితే బాలయ్య స్థానంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులు..మాత్రం ఈ సస్పెన్స్ కు త్వరగా తెరదించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *