(జనంసాక్షి) : ఇండియన్ ఇంటర్నెట్ వినియోగదారులారా మీరు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నెట్ వినియోగదారులను వణిస్తుకిస్తున్న హార్ట్ బ్లీడ్ వైరస్ భారత్ లో ప్రవేశించింది. ఈ వైరస్ ద్వారా హ్యాకర్లు కీలక సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంది. నెట్ ఉపయోగిస్తున్న సమయంలో పాస్ వర్డ్స్, క్రెడిట్ కార్డ్స్ నంబర్స్ తో పాటు ఇతర కీలక సమాచారాన్ని హ్యకర్లు తేలిగ్గా తెలుసుకుంటారు.
నెట్ ను యూజ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ భద్రతా విభాగం అధికారులు. టీఎల్ఎస్, డీటీఎల్ఎస్ హార్ట బీట్ అదనపు పాకెట్లను వినియోగించే సమయంలో సరైన తనిఖీలు చేయకపోవం వల్లే ఈ వైరస్ ప్రవేశిస్తుందని వెల్లడించారు. అనుమానిత సందేశాలతో పాటు మెయిళ్లు, ఆడియో, వీడియో క్లిప్పింగ్ లు, ఈ లింక్ లను తొలగించాలని సూచిస్తున్నారు. ఇలాంటి సందేశాలు వచ్చిన వెంటనే పాస్ వర్డ్ లు మార్చుకోవాలని చెబుతున్నారు.
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ బారిన పడకుండా ఉండగలుగుతామని సైబర్ భద్రతా సిబ్బంది సూచిస్తోంది. ఓపెన్ SNL ను 1.0.1జి వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసుకోవడంతో పాటు యాంటీ వైరస్, ఆపరేటింగ్ సిస్టమ్ లను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవాలని చెబుతోంది.




