
అందుకు బాధ పడుతున్నాం
తెలంగాణలో అధికారం టీఆర్ఎస్దే
జైరామ్ సర్పంచ్‌గా కూడా గెలవడు : కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 12 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని టీఆర్ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది నూటికి నూరుపాళ్లు టీఆర్ఎస్ అని ఆయన అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని, నూటికి నూరు శాతం తామే అధికారంలోకి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్ అక్కర్లేదన్నారు. శనివారం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమైన కేసీఆర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను వంద శాతం అమలు చేసి తీరుతామన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందన్నారు. తాము 20 జిల్లాల ప్రతిపాదన తీసుకుని వచ్చిన తరవాతనే కాంగ్రెస్ ఇప్పుడు జిల్లాల ప్రతిపాదన అంటోందన్నారు. తమ మేనిఫెస్టోలో పొందు పర్చిన అంశాలు అమలు చేయాలంటే లక్షల కోట్లు కావాలని కాంగ్రెస్ ఎద్దేవా చేయడాన్ని తప్పు పట్టారు. దీనిని అమలు చేయడానికి డబ్బు కాదని, ఎకనమికల్ విజ్డమ్ అవసరమన్నారు. వీరికి ఎంతసేపు జేబులో వేసుకోవడం తప్ప ప్రజల గురించి ఆలోచించరన్నారు. అందుకే ఇది వారికి అసాధ్యంగా కనిపిస్తుందన్నారు. పొన్నాల తదితరులు చేస్తున్న వాదనలో పసలేదన్నారు. అయినా కాంగ్రెస్ నేతలు ఇక విమర్శలు మానుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలో ఎవరు ఏమిటో తేలబోతున్నదన్నారు. కాంగ్రెస్‌కు దూరదష్టి లేదని, ప్రజల్లో నవ్వులపాలవడం ఖాయంమన్నారు. కాంగ్రెస్ నీతి ప్రకారం పావలా ప్రజలకు.. ముప్పావలా జేబులకు పోతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోను అమలు చేస్తాయమని హామీఇచ్చారు. తెలంగాణకు చాలా విషయాల్లో అన్యాయం చేసింది జైరాం రమేషే అని కేసీఆర్ అన్నారు. ఇప్పటికైనా జైరాం పిచ్చికూతలు మానుకోవాలన్నారు. జైరాం రమేష్ జీవితంలో సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి జైరాం అన్నారు. ఆయన వల్లనే పోలవరం ముంపు ప్రాంతాలు అటు వెల్లేలా చేశారన్నారు. పొన్నాల లక్ష్మయ్య టీఆర్ఎస్ మేనిఫెస్టోను కాపీ కొట్టిండని మండిపడ్డారు. కేసీఆర్‌ను తిట్టడమే టీ కాంగ్రెస్ నేతల ప్రచారమైంది. పొన్నాలలాంటి నేతలకు స్వతంత్రంగా ఆలోచించే జ్ఞానం లేదు. ప్రజలకు మేం అరచేతిలో వైకుంఠం చూపించలేం. బీసీలకు 30 టికెట్లు ఇచ్చినం. 55 శాతం బడుగు, బలహీన వర్గాలకు సీట్లు కేటాయించామన్నారు. సాధ్యమైనంత వరకు అందరికీ న్యాయం చేశామన్నారు. ఉద్యమంలో ఉన్నవారితో పాటు రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. టికెట్లు దక్కని వారికి ఇతరత్రా న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు దక్కని వారు బాధ పెట్టుకోవద్దన్నారు. మోలుగురి భిక్షపతి, బొంతు రామ్మోహన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వారు బాధ పెట్టుకోవద్దన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ స్థానాలిచ్చి గౌరవిస్తాం. పార్టీకి సేవ చేసిన వారికే సీట్లు కేటాయించినం. అవకాశం రాకున్నా నా మాటకు గౌరవం ఇచ్చిన వారికి న్యాయం చేస్తాం. ఉద్యమంలో పని చేసి టికెట్ రాని వారిపై సానుభూతి ఉందన్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఎన్నికల ప్రచారం కోసం టీఆర్ఎస్ త్రీడీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. ¬లోగ్రామ్ విధానం ద్వారా కేసీఆర్ సభలు 700 ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌లో ¬లోగ్రామ్ కేసీఆర్ సభలు 200 ఉంటాయని పేర్కొన్నారు. 16వ తేదీ నుంచి రోజుకు ఆరు, ఏడు సభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 13న కరీంనగర్, 14న నల్లగొండ, 15న నిజామాబాద్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో టిఆర్ఎస్ గెలుపు అనివార్యమన్నారు.
కొందరికి టికెట్లియ్యలేకపోయాం




