Tuesday, 3 November 2026

ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు వీరే

20 లోక్‌సభ, 139 అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను అధిష్టానం ఆదివారం సాయంత్రం వెల్లడించింది. 139 అసెంబ్లీ, 20 పార్లమెంట్‌ స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను ఖరా రు చేసింది. ఇంకా ఐదు పార్లమెంట్‌, 26 శాసనసభ సా ్థనాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. లోక్‌సభ అభ్య ర్థులు శ్రీకాకుళం – కిల్లి కృపారాణి (సిట్టింగ్‌), విజయ నగరం – బొత్సా ఝాన్సీ (సిట్టింగ్‌), అరుకు – కిషోర్‌ చంద్రదేవ్‌ (సిట్టింగ్‌), ఒంగోలు – దర్శి పవన్‌కుమార్‌, నర్సాపురం – కనుమూరి బాపిరాజు (సిట్టింగ్‌), అమలా పురం – బుచ్చి మహేశ్వర్‌రావు, ఏలూరు – నాగేశ్వర్‌ రావు, గుంటూరు – షేక్‌ వహీద్‌,
బాపట్ల – పనబాక లక్ష్మి (సిట్టింగ్‌), తిరుపతి – చింతా మోహన్‌, కాకినాడ – పల్లంరాజు (సిట్టింగ్‌), రాజమండ్రి – కందుల లక్ష్మీదుర్గేశ్‌, విజయవాడ – దేవినేని అవినాశ్‌, నెల్లూరు – వాకాటి నారాయణరెడ్డి, రాజంపేట – సాయిప్రతాప్‌ (సిట్టింగ్‌), నంద్యాల బీవై రామయ్య, కర్నూల్‌ – కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (సిట్టింగ్‌), నరసరావుపేట – కాసు వెంకట కృష్ణారెడ్డిలకు టికెట్లు ఖరారు చేసింది. ఇంకా విశాఖపట్నం, మచిలీపట్నం, కడప, అనంతపురం, చిత్తూరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీరితో పాటు 139 మంది శాసనసభ అభ్యర్థుల పేర్లను అధిష్టానం వెల్లడించింది. శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుంటూర్‌ వెస్ట్‌ నుంచి పోటీ చేయనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *