Tuesday, 3 November 2026

నచ్చకపోతే నోటా నొక్కండి


అక్రమార్కులపై కటిన చర్యలు : భన్వర్‌లాల్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చక పోతే నోటా నొక్కాలని రా ష్ట్ర ఎన్నికల ప్రధానాధికా రి
భన్వర్‌లాల్‌ తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన అవగాహన కార్యక్రమాలవల్ల ఓటర్ల నమోదు పెరిగిందని, అలాగే దానికి అనుగుణంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగిందని ఆయన అన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని చూస్తుంటే యువఓటర్లు పెరిగారని, దానికి అనుగుణంగా ఓటింగ్‌ శాతం పెరిగిందని, ఈ క్రెడిట్‌ ఎన్నికల సంఘానికే దక్కుతుందన్నారు. ఆదివారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 33 శాతం ఓటర్లు పెరిగారని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో చేసిన తనిఖీల్లో వేలాది లీటర్ల మద్యం పట్టుబడినట్లు చెప్పారు. అలాగే దాదాపు రూ.100 కోట్ల వరకు నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇది ఎంతో శుభపరిణామమన్నారు. డబ్బు, మద్యం పట్టుబడటంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాజకీయ పార్టీల నేతల ప్రలోభాలకు లొంగవద్దని, నీతి, నిజాయితీ, స్వచ్ఛమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుని గెలిపించుకోవాలన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఓటర్లకు తాగునీరు కల్పించడం జరుగుతుందన్నారు. ఎండాకాలం కారణంగా పొలింగ్‌ను సాయంత్రం 6 గంటల వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఎవరికైనా అభ్యర్థులు నచ్చకపోతే, అది తెలపడానికి ‘నోటా’ను ప్రవేశపెట్టడం జరిగిందని ఓటర్లు నిర్భయంగా ప్రజాస్వామ్యం కల్పించిన ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *