Tuesday, 3 November 2026

ఎన్నికలప్పుడే ముస్లింలు, బడుగులు గుర్తుకొస్తారు


బూటకపు వాగ్దానాలు నమ్మొద్దు
భూర్జువాల వైపు నిలువొద్దు : మాయావతి
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) :
భూర్జువా పార్టీలకు ఎన్నికలప్పుడే ముస్లింలు, బడుగులు గుర్తుకొస్తారని, దేశంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. హైదరాబాద్‌లోని నిజా కళాశాల మైదానంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సుధీర్ఘవకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, భాజాపాల వల్లే ఈ స్థితికి కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ కోసం ప్రధానమంత్రి పథకం ప్రవేశపెట్టినంట్లుందని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ ప్రధాని అయితే దేశమంతా గోద్రా తరహా ఘటనలు పునరావృతమయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ బయటా, లోపలా తెలంగాణకు బీఎస్సీ పూర్తి ఉద్ధేశం లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో బీఎస్సీలో అధికారంలోకి వస్తే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు భూర్జువా పార్టీల వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని, రాజ్యాధికారాన్ని సాధించుకుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *